ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఏడాది లోపల ఎన్నికలు జరగనున్నాయి. ఒక పక్క జగన్ పాదయాత్ర తో దూసుకు పోతున్నాడు. మరో పక్క ప్రజలు చంద్ర బాబు పాలన మీద అసంతృప్తి పెరిగిపోతుంది.మరో పక్క సర్వేలు.. దీనితో చంద్ర బాబు కు ఊపిరి ఆడని పరిస్థితి. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఏపీలో 41.3 ఓట్ల శాతం వైసీపీకి దక్కుతుండగా అధికారంలో ఉన్న టీడీపీకి 31.2 శాతం ఓట్లు మాత్రమే సొంతం కానున్నాయని వెల్లడించింది. తెలంగాణలో అధికారం మరోమారు కేసీఆర్దేనని వెల్లడించింది. అయితే గతం కంటే ఓట్ల శాతం తగ్గి 31 శాతానికి చేరుతుందని పేర్కొంది.

Image result for chandra babu and jagan

వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరనున్న నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఈ సర్వే చేసింది. దీని ప్రకారం తెలంగాణలో అధికారం గులాబీ పార్టీదేనని తేలింది. ప్రతిపక్షాలు బలపడటం మహాకూటమి రూపంలో జట్టుకట్టడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్ ఎస్ సొంతం చేసుకునే ఓట్ల శాతం గతం కంటే తగ్గిపోనుందని పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే జగన్ దే పైచేయి అని స్పష్టమవుతోందని పేర్కొన్న ఈ సర్వేలో టీడీపీ-బీజేపీ నష్టపోతుందనే విషయం ప్రజలు వెల్లడించినట్లు పేర్కొంది.

Image result for chandra babu and jagan

బీజేపీకి ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా దక్కవని ప్రస్తావించింది. గతంలో గెలిచిన రెండు ఎంపీ స్థానాలను కూడా బీజపీ కోల్పోతుందని తెలిపింది. 2014లో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితం కానుందని రిపబ్లిక్ టీవీ సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం ఎన్నికలు జరిగితే 20 స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఇక ప్రధాన పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: