రిపబ్లికన్ టీవీ - సీ వోటర్  సర్వే సంస్థ కొన్నాళ్లుగా వరస పెట్టి సర్వేలు చేయిస్తోంది. దేశ వ్యాప్తం గా ఉన్న ప్రజాభిప్రాయ పరిస్థితి గురించి అది ప్రతిబింబించే లాగా  రిపబ్లికన్ టీవీ చానల్ వరస సర్వేలు నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఏపీలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ గురించి కూడా సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ జాతీయ సమాచార వ్యవస్థ చేయించిన తాజా సర్వే చాలా ఆసక్తిదాయకంగా ఉంది.

republic tv c voter survey 2018 కోసం చిత్ర ఫలితం

రిపబ్లికన్ టీవీ - సీ వోటర్" సర్వే ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ లో "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం" వీయనుందని తెలిపింది. ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలున్న  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం పుష్కళం గాఉందని, కేవలం ఐదు  సీట్ల ను మాత్రం "తెలుగు దేశం పార్టీ" నెగ్గుతుందనేది ఈ సర్వే అంచనా.

republic tv c voter survey 2018 కోసం చిత్ర ఫలితం

2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎనిమిది పార్లమెంట్ సీట్లలో విజయం సాధించింది. ఈ సారి మాత్రం "వైసీపీ ఇరవై పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఓట్ల శాతం విషయానికి వస్తే వైసీపీకి నలభై ఒక్క శాతానికి పైగా ఓట్లు వస్తాయని, తెలుగు దేశం పార్టీకి ముప్పై ఒక్క శాతం ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం దక్కేది మాత్రం ఐదు మాత్రమేనని ఈ సర్వే తేల్చింది.

republic tv c voter survey 2018 కోసం చిత్ర ఫలితం

ఇక జాతీయస్థాయిలో మళ్లీ ఎన్డీయేకే అవకాశం ఉంది.  భాగస్వామ్య పక్షాలతో కలుపుకుంటే ఎన్డీయే మెజారిటీకి మరో పది సీట్ల దూరంలో నిలుస్తుంది ఈ అధ్యయనం అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: