తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. ఆ పార్టీ మూల సిధ్ధాంతం అదే. ఓ విధంగా చెప్పాలంటే ప్రాణం కూడా. మరి అటువంటి ప్రాణాన్నే చంపేసే విక్రుత క్రీడ జరిగిపోయింది. ఇపుడు టీడీపీలో అసలైన అభిమానులు, నందమూరి వారసులు మూల సిధ్ధాంతాన్ని బతికించగలరా, బాబు మార్క్ కాంగ్రెస్ పాలిట్రిక్స్ నుంచి పార్టీని బయటకు తేగలరా


అలా పుట్టిన పార్టీ:


టీడీపీ ఆషామాషీగా పుట్టిన పార్టీ కాదు, స్వయంగా అన్న గారు నందమూరి తారక రామారావుని కాంగ్రెస్ ఎన్నో అవమానాలకు గురి చేసింది. తెలుగులో నంబర్ వన్ హీరోగా సూపర్ స్టార్ డం అనుభవిస్తున్న నందమూరిని పూచిక పుల్లను చూసినట్లుగా చూసేది. అప్పట్లో తమిళ నాడులో శివాజీగణేషన్ కి రాజ్యసభ సీటు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అది చూసిన అన్న గారు ఏపీకి సంబంధించి తన పేరు కూడా నామినేట్ చేయవచ్చు కదా అని భావించారు. అయితే కాంగ్రెస్ కి నందమూరి అంటే కేవలం సినిమా నటుడే తప్ప మరేం కాదని లెక్కలేనితనం తో పట్టించుకోలేదంటారు. 


అలాగే మరో సంధర్భంగా నెల్లూరు లో ఓ హొటల్ లో అన్న గారు విడిది చేస్తే రాత్రికి రాత్రి ఓ కాంగ్రెస్ పెద్దాయన వచ్చాడన్న కారణంగా నిద్ర లేపి మరీ అన్న గారి రూం ఖాళీ చేయించి అవమానించారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యక్షంగా అన్న గారి పట్ల చేసిన అవమానాలు ఎన్నో. పద్మశ్రీ బిరుదు ఇచ్చెటపుడు, హైదరబాద్ లో స్టూడియో  నిర్మాణానానికి స్థలం ఇవ్వడం విషయంలో వివక్షే చూపించారు. ఇవన్ని మనసులో ఉంచుకున్న నందమూరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి  కాంగ్రెస్ ని ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించివేశారు


స్వచ్చమైన నేతలు :


ఇక టీడీపీ ఆవిర్భావం ద్వారా ఎందరో నాటి యువకులు పార్టీలో చేరి పెద్ద పదవులు అధిష్టించారు.  కొత్త రాజకీయానికి నందమూరి తెర తీశారు. కాంగ్రెస్ కి పూర్తి భిన్నంగా  పాలన సాగింది. నందమూరి ఏ తప్పులైతే కాంగ్రెస్ చేసిందో అవి చేయకుండా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆయన జనంతోనే నేరుగా సంబంధాలు నెరిపారు. లాబీయింగ్ అన్న మాటకు తావు లేదు. అటువంటి ఆవేశం నుంచి పుట్టిన తెలుగుదేశం సాదా సీదా పార్టీ కానే కాదు. మరి దాని ఆత్మను ఇపుడు చంపేశారు. అసలైన అభిమానులు, వారసులు రియాక్ట్ అవుతారా.



మరింత సమాచారం తెలుసుకోండి: