అవును మీరు చదివింది నిజమే. కాకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపి మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రబాబునాయుడు స్దానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వటం కాదు. ఇపుడే సిఎం అయిపోయారు. దొడ్డిదోవన ఎంఎల్సీ అయి మంత్రిపదవి అందుకున్నట్లే. ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనాల్సి లోకేష్ పేరుతో వీరాభిమానులు పెట్టిన పోస్టర్లవి. వచ్చే ఎన్నికల్లో టిడిపి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుందో రాదో అనే అనుమానం వచ్చినట్లుంది అభిమానులకు. అందుకనే కనీసం పోస్టర్లలో అయినా ముఖ్యమంత్రిని చేసేసి పబ్బం గడుపుకుందామని కొందరు వీరాభిమానులు ఓవర్ యాక్షన్ చేసినట్లు కనబడుతోంది.


కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో టెలిమెడికాన్-2018 అనే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వేదిక వద్ద, యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ఇటువంటి పోస్టర్లే కనిపించాయి. కాకపోతే అత్యుత్సాహపరులు యధావిధిగా పప్పులో కాలేశారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసిన వీరాభిమానులు మొత్తం రాష్ట్రానికి కాకుండా కేవలం ఐటి, పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలకు మాత్రమే పరిమితం చేయటం గమనార్హం.

 

రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిని చేసేస్తే మళ్ళీ చంద్రబాబునాయుడుతో సమస్యలు వస్తాయనుకున్నారో ఏమో తెలీదు. అందుకనే లోకేష్ ను మూడు శాఖలకు మాత్రమే ముఖ్యమంత్రిగా పరిమితం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగున్నా మొత్తానికి లోకేష్ ఇపుడే ముఖ్యమంత్రిగా పోస్టర్లకు ఎక్కేశారు. కాకపోతే ఈ పోస్టర్లుల నెటిజన్ల కంటపడటంతో లోకేష్ ను ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్నారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: