తెలంగాణ లో మహాకూటమి లో టీడీపీ ఉండటం వల్ల ఆ కూటమి కి ఆక్సిజన్ వచ్చిందని స్వయంగా కేటీఆరే ఒప్పుకున్నాడు అయితే కూటమిలో చివరికి అందరి కంటే తక్కువ సీట్లు వచ్చేవిధంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటివరకైతే తెలంగాణలో టీడీపీకీ 14 సీట్లు కన్ఫామ్ అంటూ లీకులు వచ్చేశాయి. సీపీఐ, టీజేఎస్ మధ్య 10 సీట్లు పెట్టి పంచుకోమని చెబుతున్నారు. అయితే కోదండరామ్ కి మాత్రం ఇది సుతరామూ ఇష్టంలేదు. తమకి మాత్రమే 15సీట్లు, అదీ కోరిన చోట ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో కూడా ఆయన ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు.

Image result for telangana mahakutami

ఇప్పటికే కూటమి సీట్ల వ్యవహారం లేటైందని, ఇంకాలేటైతే ప్రచారంలో వెనకపడతామని, నష్టపోతామని ఆయన రాహుల్ కి చెప్పారు. 15 ఇవ్వకపోయినా రెండు మూడు సీట్ల దగ్గర పట్టింపులు ఉండబోవని కూడా చెప్పారు. అయితే 10 సీట్లు పంచుకోమంటూ సీపీఐతో లింకుపెడితే మాత్రం కుదరదన్నారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈరోజు ఫైనల్ సిట్టింగ్ లో సీట్ల లెక్క తేలాల్సి ఉంది. టీజేఎస్ మరీ పట్టుబడితే టీడీపీ సీట్లలో కోతపెట్టి కోదండరాంకి కట్టబెట్టేందుకు సైతం కాంగ్రెస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Image result for telangana mahakutami

కోతలు, వాతలు పెట్టినా టీడీపీ కాంగ్రెస్ ని వదిలిపెట్టి సొంతంగా పోటీచేసే పరిస్థితి తెలంగాణలో లేదు, ఇప్పటికే ఈ విషయంలో అక్కడి నేతలకు బాబు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్ని దొరికితే వాటితోనే తృప్తిపడమని చెప్పేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా అందర్నీ తృప్తిపరచాలంటే టీడీపీ త్యాగం చేయక తప్పని పరిస్థితి. పైకి దీన్ని త్యాగం అంటున్నాం కానీ తరచిచూస్తే టీడీపీది ఆటలో అరటిపండు పాత్ర అనే విషయం అర్థమౌతుంది. అందిన కాడికి పుచ్చుకొని సర్దుకుపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: