చంద్ర బాబు కాంగ్రెస్ పొత్తు పెట్టు కోవడం తో పాటు ఢిల్లీ లో రాహుల్ తో భేటీ అవ్వడం ఈ పరిస్థితులన్నీ బాబు కు ఆంధ్ర రాజకీయాల్లో షాక్ ను ఇస్తాయని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అన్న ఆ పార్టీ అన్న విశ్వాసం పోయింది. ఇంకా కోపం వారి మీద పోలేదు. ఇలా బాబు పొత్తు పెట్టుకోవడం జగన్ కు కలిసొస్తుంది. చాలా మంది టీడీపీ నాయకులూ అసంతృప్తి తో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులూ కూడా పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. 

Image result for chandra babu

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు సిద్ధమని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని హస్తం పార్టీ సీనియర్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వట్టి వసంత్ కుమార్ తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, కొద్ది రోజుల తర్వాత సొంతగూటికే చేరుకుంటానని ఆయన ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ నేతలను తిట్టని రోజంటూ లేదని వ్యాఖ్యానించారు. అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని విమర్శించారు. 

Image result for jagan

విభజన చట్టంలో పేర్కొన్న హామీల కింద రూ.2 లక్షల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నా వాటిని సాధించుకోవడంలో చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విభజన హామీల విషయంలో ప్రజలకు బాబు అబద్ధాలు చెప్పారని, ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగలేక బయటకు వెళ్లిపోతున్నానని స్పష్టం చేశారు. అలాగే టీడీపీ-కాంగ్రెస్ పొత్తులపై పీసీసీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదనీ, సీనియర్ నేతలను సైతం సంప్రదించలేదని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఎన్నికల ముందు బాబుకు ఈ పొత్తు లాభాన్ని కంటే నష్టమే ఎక్కువ చేసేటట్లు కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: