ఆంధ్ర ప్రదేశ్ లో ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రక్క మండిపడుతుంటే, అదే దాడులు జరిగిన చంద్రబాబు టిడిపి పార్టీ నేతలకు సంబందించిన ఒక కంపెనీ తాము అరవై కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని లెక్కల్లో చూపించలేదని ఒప్పుకుని పన్ను కట్టడానికి అంగీకరించడం విశేషం.
IT raids on peram group కోసం చిత్ర ఫలితం
తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అతి సన్నిహితంగా ఉండే పేరం హరిబాబుకు చెందిన "పేరం గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ" లో ఆదాయపన్ను శాఖ అదికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, తిరుపతి,బెంగుళూరులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ సంస్థ లో సోదాలు ముమ్మరంగా జరపగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు వారికి లభించాయి. 
IT raids on peram group కోసం చిత్ర ఫలితం
విశాఖపట్నంలో ముఖ్యమైన పత్రాలు కొన్నిటిని ఎవరికి కనిపించకుండా ఆ కంపెనీ జాగ్రత్త చేసినా, ఐటి సిబ్బంది కనుగొనగలిగారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఒక కధనాన్ని ఇచ్చింది.సోదాల తర్వాత అరవై కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని లెక్కలలో చూపలేదని ఆ సంస్థ నిర్ద్వమందంగా అంగీకరించిందని ఆదాయపన్ను శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం ఇందులో ముప్పై శాతం అంటే సుమారు ఇరవైకోట్ల రూపాయల వరకు పన్ను చెల్లించడానికి కంపెనీ అంగకరించిందని ఆ కదనం చెబుతోంది.
peram haribabu yarapatineni srinivasa rao కోసం చిత్ర ఫలితం
పేరం హరిబాబు , టిడిపి వివాదాస్పద ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వియ్యంకులు అవుతారు. ఇప్పుడు ఇలా పన్ను కట్టడం కూడా నేఱమేనని నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవశాలి, ఎవరికి తలవంచని ధీరుడు, అందరి మెడలనువంచే ధీశాలి, ఆంధ్రప్రదెశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నిప్పు నారా చంద్రబాబు నాయుడు అంటారా?

peram haribabu yarapatineni srinivasa rao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: