ఆయనకు మంచి నాయకునిగా గుర్తింపు ఉంది. గిరిజన నేతగా కూడా పేరుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏరీ కోరీ ఆయనను ఏఐసీసీ మెంబర్ గా తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తుల నేపధ్యంలో ఆయన అవకాశాలూ మెరుగుపడ్డాయన్న టాక్ ఉంది. అన్నీ అలా అనుకూలంగా  ఉంటే  ఆయన మాత్రం పోటీ చేస్తానంటూనే ఏ పార్టీ అన్నది క్లారిటీ ఇవ్వకుండా పోవడంపైన చర్చ సాగుతోంది.


పార్టీలు పిలుస్తున్నాయి :


విశాఖ  జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరజు కాంగ్రెస్ లో సీనియర్. 2009 నుంచి 2014 వరకూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో విభజన కారణంగా ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఇనాక్టివ్ గా ఉన్నా రాహుల్ అధ్యక్షుడయ్యాక మళ్ళీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆయనకు కాంగ్రెస్ టీడీపీ పొత్తులు కూడా కలసి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు పిలుస్తున్నాయని చెప్పడం సందేహాలకు తావు ఇస్తోంది.


సీటు గ్యారంటీ:


పొత్తులో భాగంగా విశాఖ  జిల్లా పాడేరు నుంచి కాంగ్రెస్ సీటు తీసుకుంటుందని అంతా భావిస్తున్నారు. అక్కడ నుంచి బాలరాజుని పోటీకి నిలబెడతారని ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బాలరాజు తాను పోటీ చేయడం ఖాయం కానీ ఏ పార్టీనో చెప్పను అనడం పట్ల డౌట్లు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయరా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక అయనను వైసీపీలోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే జనసేన కూడా పిలుస్తోందని అంటున్నారు.


పొత్తులు హై కమాండ్ ఇష్టం:


ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది హై కమాండ్ ఇష్తమని బాలరాజు అంటున్నారు. మరి పొత్తుల పట్ల ఆయన స్పందన తెలియచెయలేదు కానీ కాంగ్రెస్ లో ఉండే అవకాశాలను మాత్రం సందేహంగానే ఉంచుతున్నారు. నిజంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయదలిస్తే ఆయన పక్కాగా చెప్పేవారు, పైగా పొత్తులు వాళ్ళిష్టం అంటూ చేసిన వ్యాఖ్య‌లలో మర్మమేదో ఉందనిపిస్తోంది. టీడీపీని వ్యతిరేకించే బాలరాజుకు కూడా ఈ పొత్తులు నచ్చడం లేదా లేక ఆయన వేరే పార్టీల వైపు చూస్తున్నారా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. మొత్తానికి ఈ మాజీ మంత్రి మంచి సస్పెన్స్ లో పెట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: