బాహుబలి అంత గొప్ప ధీరోదాత్త కథానాయకుడని నిరూపించబడటంలో ఆయన ప్రత్యర్ది బళ్ళాలదేవుడే ప్రధాన కారణం. ఇద్దరూ ఒకరి కొకరు బద్ధ వైరంతో యుద్ధం చేయబట్టే ఆ సినిమా మహారంజుగా సినీ రంగస్థలాన్ని ఉర్రూతలూగించింది. హీరో గా ఒక వెలుగు వెలగాలని అంటే విలనీ రక్తిగడితేనే. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సరైన ప్రత్యామ్నాయం లేక పోవటం తో అతను గొప్ప విజయం సాధించబోతున్నా అది ఆయనకే కాదు దేశానికి కూడా చప్పగా ఉండటానికి కారణం  ధీటైన ప్రత్యర్థి లేక పోవడం.

అది ఆయనకు  గొప్ప ప్లస్ పాయింట్ అవుతోంది అంటోంది “డైలీ హంట్ – నీల్సన్ సర్వే” రెండు రోజుల క్రితం “టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే” కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికే ఛాన్స్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాలా సీట్లను కోల్పోయినా మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మళ్లీ మెజారిటీకి చేరువలోనే ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. ఎన్డీయే లోని పార్టీలకు మెజారిటీకి పది సీట్లు మాత్రమే తక్కువ అవుతాయి అని ఆ అధ్యయనం తేల్చింది.
Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term
తాజాగా “డైలీహంట్ నీల్సన్ సర్వే” కూడా మోడీకే బాసటగానిలిచింది. దీని ప్రకారం మళ్లీ నరేంద్ర మోడీనే ప్రధాని కావాలని అరవై మూడు శాతం మంది అంటున్నారు. మోడీ పని తీరు, నాయకత్వం మీద వీరంతా పూర్తి సంతృప్తితో ఉన్నారని ఈ అధ్యయనం అంటోంది. సంక్షోభం ఎదురైన సందర్భంలో నరేంద్ర మోడీనే సమర్థుడు అని వీరంతా అన్నారట.
Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term
వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని గా ఎవరు అంటే మోడీకి అరవై మూడుశాతం మంది మద్దతు పలకగా.. రాహుల్ గాంధీకి కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అరవింద్ కేజ్రీవాల్ కు ఎనిమిది శాతం, అఖిలేస్ యాదవ్ కు మూడుశాతం, మాయవతికి రెండుశాతం మంది మద్దతు పలి కారని ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వేను బట్టి అర్థం అవుతున్నది ఏమిటంటే, బలమైన ప్రధానమంత్రి అభ్యర్థి లేకపోవడం, అనేది మోడీ వైరిపక్షాలకు పెద్ద మైనస్ పాయింట్ అవుతోంది. బీజేపీ వ్యతిరేక పక్షాలకు కాంగ్రెస్ పార్టీనే పెద్ద దిక్కు. ఆ పార్టీకి రాహుల్ గాంధీ పెద్ద దిక్కు. అతడేమో జనాల్లో ఇప్పటికీ నమ్మకం కలిగించలేక పోతున్నాడు. ఫలితంగా మోడీకి తిరుగే లేకుండా పోయేట్టుంది.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

  • "ట్రస్ట్ ఆఫ్ ది నేషన్" ఓటర్లకు 10 ప్రశ్నలు సంధించారు. సమాధానం ఇచ్చేందుకు నాలుగు సమాధానాలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో కూడా ఇచ్చారు. డైలీ హంట్ ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ సర్వే హైలైట్స్: * 2014తో పోలిస్తే మళ్లీ అదే స్థాయి లేదా కొంచెం ఎక్కుగా అంటే 63 శాతం మంది ఓటర్లు నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. ఈయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మోడీ పాలన భేష్ అన్నారు. *

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term



నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారత్‌కు మంచి భవిష్యత్తు ఉందని 50 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. * ఓటర్లు వినియోగించే ఫోన్లు ఆధారంగా ఆదాయం అంచనా వేశాం. తక్కువ లేదా మధ్య శ్రేణి ధరల ఫోన్లు వినియోగి స్తున్న 90 శాతం మంది ఓటర్లు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది హై ఎండ్ ఫోన్ వాడుతున్న వారి కంటే ఎక్కువగా ఉంది.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

మరింత సమాచారం తెలుసుకోండి: