అక్టోబర్ 25వ తేదీ గురువారం విశాఖపట్టణము విమానాశ్రయంలో విఐపి లాంజ్ లో రెస్ట్ తీసుకుంటున్న వైసీపీ అధినేత జగన్ పై ముమ్మిడివరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యాయత్నం చేసిన విషయం  రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. జగన్ పై దాడి అంటూ వార్త వినగానే రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు మరియు వైసీపీ కార్యకర్తలు ఎంతగానో కంగారుపడ్డారు.  

Image result for jagan attack knife

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జగన్ కావాలని తనపై దాడి చేయించుకుని సానుభూతి రాజకీయాలకు పాల్పడుతున్నారని దాడి ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. మరోపక్క జగన్ పై జరిగిన దాడిని తెలుగు రాజకీయ నాయకులు చాలా మంది   ఖండించారు.

Image result for jagan attack knife modi

ఈ క్రమంలో వై.సి.పి కి చెందిన నేతలు..ఇది కావాలని చంద్రబాబు జగన్ ని హతమార్చాలని చేసిన ప్లాన్ అన్ని ఆరోపిస్తుంటే..మరోపక్క కేంద్ర పరిధిలో ఉండే ప్రాంతంలో దాడి జరిగితే మాకేంటి సంభంధం అన్ని టిడిపి పార్టీ కి చెందిన నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కేంద్రం ఓ అధికారిని బదిలీ చేసింది.

Image result for jagan attack knife

విశాఖపట్నం ఎయిర్ పోర్టు సీఐఎస్ఎఫ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ ను చెన్నైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ పోర్టు లోపలికి కత్తి వెళ్లడం, జగన్ పై దాడి జరగడం పట్ల వేణుగోపాల్ ను బాధ్యుడిని చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. తాజాగా జగన్ కేసులో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైనట్లు ఆంధ్ర రాజకీయాలలో టాక్ వినపడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: