చంద్ర బాబుకు రాజకీయాల్లో అపార చాణిక్యుడు అని బిరుదు ఉంది. దానికి తగ్గట్టుగానే అతను  ఎన్నికల్లో విజయాలను సాధిస్తుంటాడు. కొన్ని సార్లు ఓటమి కూడా చూసాడనుకోండి అదే వేరే విషయమే.. అయితే చంద్ర బాబు రాహుల్ చేత ఒక భారీ సభను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడట.. మరీ ప్రజల స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మొన్నటివరకు మోడీ జపం చేశాడు. ఇపుడేమో ఆంధ్ర ను నిలువునా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ వద్దకు చేరుతున్నాడు. 

Image result for chandra babu

స్వయంగా చంద్రబాబు, రాహుల్‌ ఇంటికి వెళ్ళి మరీ, కాంగ్రెస్‌ - టీడీపీ 'స్నేహాన్ని' అధికారికం చేసేసుకున్నారు. అతి త్వరలో అమరావతి వేదికగా కాంగ్రెస్‌ - టీడీపీ కలిసి ఓ భారీ 'షో' చేసేందుకూ ఈ సందర్భంగానే ఓ అవగాహన కుదిరిందట. కనీవినీ ఎరుగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించి, తద్వారా రాహుల్‌ని, కాంగ్రెస్‌ పార్టీని మెప్పించాలన్నది చంద్రబాబుగారి ఆలోచన అట. ఎక్కడైతే, ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన చేశారో అదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించి, రాహుల్‌తోపాటు పలువురు జాతీయ నాయకుల్ని ఆ వేదికపై కూర్చోబెట్టి.. చంద్రబాబు, నరేంద్రమోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వావ్‌.. ఇలాంటి ఐడియాలు చంద్రబాబుకి కాక ఇంకెవరికి వస్తాయ్‌.?

అమరావతికి రాహుల్‌.. ఈసారి చంద్రన్న కొత్త 'షో'.!

చంద్రబాబు చెప్పినట్లు జనం వినాలంతే. ఎందుకంటే, ఆయనదో ప్రత్యేకమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే 'రాజ్యం' నడవాలనుకుంటారు.. ఒక్కమాటలో చెప్పాలంటే, చంద్రబాబు ఇలాంటి విషయాల్లో 'నియంత'లా వ్యవహరిస్తున్నారనడం అతిశయోక్తి కాకపోవచ్చు. లేకపోతే, కాంగ్రెస్‌తో పొత్తుని టీడీపీ శ్రేణులు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ హుకూం జారీ చేయడమేంటి.? అసలు టీడీపీ ఎలా ఆవిర్భవించింది.? టీడీపీ సిద్ధాంతమేంటి.? అన్న ప్రశ్నలకు ఇప్పుడు చంద్రబాబు దగ్గరా సమాధానం లేదాయె.!


మరింత సమాచారం తెలుసుకోండి: