Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 7:12 am IST

Menu &Sections

Search

బాబు ఎఫెక్ట్‌... జనసేనలోకి టాప్‌ లీడర్ల క్యూ..!

బాబు ఎఫెక్ట్‌... జనసేనలోకి టాప్‌ లీడర్ల క్యూ..!
బాబు ఎఫెక్ట్‌... జనసేనలోకి టాప్‌ లీడర్ల క్యూ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలయిక తెలుగు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చినీయాంశంగా మారింది. ఈ కలయికను స్వాగతించే వాళ్లు తక్కువ మంది ఉండగా... మెజారిటీ పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ అయితే ఈ రెండు పార్టీలకు చెందిన నేతల కలయిక, పొత్తులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంది. అసలు కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేఖిస్తూ పుట్టిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ జట్టు కట్టడాన్ని, ఆ పార్టీలో పొత్తులు పెట్టుకోవడాన్ని ఏపీలో కొసరు కొసరుగా మిగిలి ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీరంతా కాంగ్రెస్‌కు రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలన్న చంద్రబాబుతో చెయ్యి కలపడాన్ని వారంతా తప్పు పడుతున్నారు. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-congress-ra

ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏపీలో కాంగ్రెస్‌ వెంటే ఉన్న తమను కనీసం సంప్రదించకుండా రాహుల్‌, చంద్రబాబుతో ఎలా చర్చలు జరుపుతారని వారంతా మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ క్రమంలోనే ఏపీలో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి మిగిలిన కాస్తో కూస్తో పేరున్న నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌తో పాటు మరో సీనియర్‌ నేత సుదీర్ఘ‌ కాలంగా రాజకీయ అనుభవం ఉన్న సీ. రామచంద్రయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఏపీలో చాలా మంది కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.  ఆ పార్టీలో అక్కడక్కడ కొద్దో గొప్పో పేరున్న నాయకులు మిగిలి ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ లేదా జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రి పెద్ద బూచిగా చూపి పార్టీ నుంచి తప్పుకునే ఛాన్స్‌ వచ్చేసింది. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-congress-ra

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామ చేసిన మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఎవరి అంచనాలకు అందకుండా జనసేనలో చేరారు. ప్రస్తుతం మనోహర్‌ జనసేనలో కీలక నేతగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌, సీ. రామచంద్రయ్య సైతం మనోహర్‌ బాటలోనే పయనిస్తారని తెలుస్తోంది. వీరిద్దరు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయట. వట్టి వసంత్‌ కుమార్‌కు, మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వసంత్‌ను పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ను నరసాపురం నుంచి ఎంపీగా బరిలో దించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలకు ముందే వసంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు 2014 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చెయ్యాలని అనుకున్నారు. అయితే చివరిలో రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌ నిర్వీర్యం అవ్వడంతో ఆయన ఎంపీగా పోటీ చేసే ఆలోచన విరమించుకున్నారు. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-congress-ra

కొద్ది రోజులుగా వసంత్‌ నరసాపురం ఎంపీగా పోటీ చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి నరసాపురం బరిలో దిగేందుకు ఊవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరో సీనియర్‌ నేత సీ. రామచంద్రయ్య సైతం జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నారట. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుటి నుంచి పవన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో రామచంద్రయ్య జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జనసేనలో సీనియర్‌ లీడర్స్‌ ఎవరూ లేరు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ వీడుతున్న నేతల దృష్టంతా పవన్‌ పార్టీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ హటావో.. దేశ్‌ బచావో నినాధాన్ని ఎత్తుకున్న పవన్‌ ఆ పార్టీ నుంచి తన పార్టీలో చేరే నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కూడా చూడాల్సి ఉంది.



andhrapradesh-tdp-cm-chandrababu-naidu-congress-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో ఈ ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్‌...ఈ స‌ర్వే ఏం చెప్పిదంటే...!
ఆ టీడీపీ నేతకు లక్కు మామూలుగా లేదుగా..!
బాబుకు భ‌యం ఎందుకు.... అస‌లు క‌థ ఇదే...!
బాలయ్యా మజాకా... చంద్ర‌బాబుపై బావ‌మ‌రిదే గెలిచాడు...!
సూపర్‌ ట్విస్ట్‌: టీడీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ..!
కేసీఆర్‌కు ఆమె మామూలు షాక్‌ ఇవ్వలేదుగా..!
వెంక‌ట‌గిరి వేడెక్కింది.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ
వారు పార్టీ మార‌రు..  జ‌గ‌న్ తీరూ మార‌దు!
బాబు సొంత జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌ని ఫ‌ట్‌!!
బాబు వ్యూహంతో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు!
టీడీపీకి చుక్క‌లే... రీజ‌న్ ఏంటంటే
ఆ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీయే క‌న‌ప‌డుతోందా...!
టీడీపీ ఎంసీ సీటు కోసం కొత్త వ్య‌క్తి.... స‌క్సెస్ అవుతారా..!
ఆ ఏపీ మంత్రి రాజ‌కీయ ప‌త‌నం ప‌క్కా... రీజ‌న్ ఇదే...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.