వైఎస్ జగన్ అంటేనే జనం. ఆయన ప్రతి అడుగు ప్రజలతోనే ముడిపడిసాగుతుంది. పదేళ్ళ రాజకీయ చరిత్రలో జగన్ నిత్యం జనంతోనే గడిపారు. వారే తన ఆస్తిగా నమ్మారు. ఓదార్పు యాత్రలు నుంచి దీక్షలు వరకు జనమే జగన్ అన్నట్లుగా ఆయన రాజకీయ జీవితం సాగీంది. ఇక ఏడాది క్రితం ఏపీలో ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర జన ప్రభంజనంగా సాగుతోంది. మరి జగన్ నుంచి జనాన్ని దూరం చేయడాన్ని ఊహించగలమా 


ఎలా ఉండబోతోంది :


గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద జరిగిన హత్యాయత్నం తరువాత పాదయాత్ర ఎలా ఉండబోతోందన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఏకంగా ఓ ప్రతిపక్ష నాయకుడి మీదనే దాడి జరిగిందంటే భద్రతాలోపం ఎలా ఉందన్నది అందరికీ అర్ధమవుతుంది. అదే టైంలో రేపటి రోజున జగన్ జనంలోకి ఎలా వస్తారన్నది కూడా ఈ దాడి తరువాత పెద్ద ప్రశ్నగా మారింది. జగన్ వేలాది మంది జనంతో ప్రతి రోజూ కదులుతారు. మరి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన తరువాత మునుపటి మాదిరిగా జనం తో జగన్ కలవడం అవుతుందా


మూడంచెల భద్రత :


జగన్ పాదయాత్ర తిరిగి ఈ నెల 10వ తేదీన ప్రారంభం కాబోతోంది. పాదయాత్ర సందర్భంగా ఈసారి జగన్ కి మూడంచెల కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా పోలీసులు నిర్ణయించారు. ఇది గతంలో కంటే అధిక భద్రత అని కూడా చెబుతున్నారు. మూడు వలయాలు దాటి మాత్రమే జగన్ వద్దకు ఎవరైన వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితులోనూ ఇతరులను జగన్ వద్దకు అనుమతించకూడని కూడా పోలీసులు కఠిన  నిర్ణయం తీసుకున్నారు. 


జనానికి కలిసే వీలు లేదా :


 మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులను మాత్రమే జగన్ వద్దకు పంపిస్తామని పోలీసుకు చెబుతున్నారు. ఇదివరకు మాదిరిగా జగన్ వద్దకు  ఎవరు పడితే వారిని వెళ్ళే అవకాశం ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర ద్వారా జనాలకు చేరువ అయ్యేది ఇకపై పరిమితంగానే ఉంటుందన్నది పోలీసుల  మాటలను బట్టి అర్ధమవుతోంది. 


నో సెల్ఫీస్ :  


అదే టైంలో జగన్ ఇపుడు సాలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆ తరువాత పార్వతీపురం వెళ్తారు. చూస్తూంటే అదంతా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. అందువల్ల కూడ జగన్ భద్రత ఇంక ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసుకు అంటున్నారు.  మొత్తంగా చూసుకుంటే జగన్ ఇకపై చేసే పాదయాత్ర పూర్తిగా పోలీసుల పహారా , గట్టి నిఘా మధ్యనే సాగుతుంది. జగన్ అందరితో సెల్ఫీలు దిగడం, కరచాలనాలు వంటివి ఇకపై పెద్దగా కనిపించవంటున్నారు. అదే కనుక జరిగితే పాదయాత్రకు ఆదరణ ఎలా ఉంటుంది, జగన్ దీనికి సమ్మతిస్తారా వంటివి కూడా చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: