చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఆయన ఏ జిల్లా నుంచి పోటీ చేస్తారు, ఆయన అసెంబ్లీగా, పార్లమెంట్ కా, ఈ మధ్యన దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు జాతీయ స్థాయిలో డిల్లీకి వెళ్ళి అన్ని పార్టీలతో కూటమి కడుతున్న టైంలో ఆయన రేపటి ఎన్నికల్లో ఏ చేస్తారన్న దానిపై ఆసక్తి మరింతగా పెరిగిపోతోంది.


ఇక్కడేనట :


బాబు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారట. ఇది స్వయంగా బాబు పార్టీ నాయకులకు చెబుతున్న విషయం. తాను తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని బాబు చెప్పుకొస్తున్నారని టాక్. తాను ఇక్కడ ఉంటేనే ఏపీ అభివ్రుధ్ధి చెందుతుందని బాబు అంటున్నారట. డిల్లీలో అనుకూలమైన ప్రభుత్వం ఉంటే దండీగా నిధులు తెచ్చుకోవచ్చునని, తద్వారా ఏపీని బాగా డెవలప్ చేయవచ్చునని బాబు అభిప్రాయంగా పార్టీ వర్గాలు అంటున్నాయి.


ఆ నినాదం వద్దు :


తాను డిల్లీకి తరచూ వెళ్తూంటే కాబోయే పీఎం అంటూ నాయకులు నినాదాలు చేయడం ఆపేయాలని కూడా బాబు ఆదేశాలు ఇచ్చారట. డిల్లీ వెళ్ళేది ఏపీ కోసమేనని బాబు క్లారిటీ ఇస్తున్నారట. ఏపీకి ఎంతో చేస్తారని మోడీతో పొత్తు పెట్టుకుని వెళ్తే ఆయన అడ్డం తిరిగారని, ఫలితంగా అభివ్రుద్ధి ఆగిపోయిందని కూడా బాబు అంటున్నట్లు భోగట్టా. అందువల్ల తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే పరిమితం అవుతానే తప్ప జాతీయ రాజకీయల జోలికి పోనే పోనని బాబు అంటున్నట్లు తెలుస్తోంది.


ఎక్కడ పోటీ :


ఇక ఎమ్మెల్యేగానే బాబు పోటీ చేస్తారన్నది క్లారిటీ వచ్చేసింది కానీ ఏ జిల్లా నుంచి అన్నది మాత్రం తెలియడం లేదు. బాబు ఈసారి తాను పోటీ చేసే కుప్పం స్థానాన్ని తన కుమారుడు లోకేష్ కి ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ నుంచి లోకేష్ బరిలో దిగితే సునాయాసంగా విజయం దక్కుతుందని బాబు భావిస్తున్నారు. తాను సీమలో మరో జిల్లా నుంచి కానీ, వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి కానీ పోటీ చేయాలని బాబు తలపోస్తున్నారు. మొత్తానికి ఈ సస్పెన్స్ మాత్రం ఎన్నిక వేళ వరకూ వీడదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: