తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తలే ప్రాణం. దేశంలో ఏ పార్టీకీ లేనంతమంది ఆ పార్టీలో ఉన్నారు. ప్రతీ రెండేళ్ళకు ఓమారు సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా అనుకున్న లక్ష్యాలను సాధించడం కూడా టీడీపీ విధానాల్లో భాగం. ఈసారి కోటి మందిని పార్టీలో చేర్పించాలని టార్గెట్ గా సాగుతున్న ఆ పార్టీకి ఆదిలోనే పెద్ద చిక్కు వచ్చిపడింది. మొత్తం క్యాడర్ ఇపుడు గందరగోళంలో ఉన్నారు.  దాంతో  క్యాడర్ ని మేలుకొలిపి పార్టీ పాలసీ ఏంటన్నది  చెప్పడానికి టీడీపీ రెడీ అవుతోంది.


పొత్తు పై ఎన్నో డౌట్లు :


టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వార్త అసలైన పార్టీ కార్యకర్తలకు శరాఘాతమే. వారంతా ఇపుడు ఏం పాలుపోకుండా ఉన్నారు. జనానికి, పార్టీకి వారధులుగా ఉన్న కార్యక‌ర్తలు ఈ పొత్తుపై పెదవి విప్పలేకపోతున్నారు. వారిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా చేయాల్సివచ్చిందన్న ఆవేదన కూడా చాలామందిలో ఉంది. అంతే కాదు కాంగ్రెస్ తో పొత్తు అంటే ఎక్కడో ఓడిపోయామన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.


.
వివరించే  యత్నం :


కాంగ్రెస్ టీడీపీల మధ్య ఎన్నో సిధ్ధాంతపరమైన వైవిద్యాలు  ఉన్నా,  రెండు పార్టీలు బద్ద శత్రువులుగా దశాబ్దాలుగా ఉన్నా ఇపుడు కలవడం చారిత్రక అవసరమని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు పార్టీలో సీనియర్లందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈ పొత్తు ఎందుకో వారికి బాగా అర్ధమైంది. అందుకే ఎవరూ బయటపడడం లేదు. పెదవి విప్పడంలేదు. అయితే క్యాడర్ కి వివరించకపోతే మొత్తానికి మొత్తంగా నష్టం వస్తుందని పార్టీ భావిస్తోందట.  అందుకే క్యాడర్ కి దిశానిర్దేశం చేసేందుకు హై కమాండ్ భారీ కసరత్తు చేస్తోంది.


కరపత్రాల ప్రచారం :


అసలు ఎందుకు టీడీపీ కాంగ్రెస్ తో కలిసేందుకు ఒప్పుకుంది. ఈ పొత్తు వల్ల పార్టీకి, ఏపీకి ఒనగూడే ప్రయోజనాలు ఏమిటి, రేపటి ఎన్నికల్లో ఎలా పనిచేయాలి అన్న వాటిమీద పూర్తి సమాచారంతో కరపత్రాలు టీడీపీ ముద్రిస్తోందట. వాటిని పార్టీ క్యాడర్ కి పంపడం ద్వారా వారు పూర్తిగా అవగాహన పొంది జనంలో కూడా పార్టీ వాదనను సమర్ధవంతంగా వివరిస్తారని పార్టీ భావిస్తోందట.
 ఈ మేరకు కరపత్రాల ప్రచార యుధ్ధం అపుడే స్టార్ట్ అయిపోయింటున్నారు. క్యాడర్ ఇపుడు సభ్యత్వ నమోదులో ఉన్నారు. ఈ టైంలొనే వారికి సరైన డైరెక్షన్ ఇస్తే ఉత్సాహంగా ముందుకు సాగుతారని టీడీపీ అనుకుంటోంది. మరి ఇది ఎంతవరకు  వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: