పవన్ కళ్యాణ్ ఎప్పడూ ఒక మాట అంటుంటాడు జగన్ మాదిరిగా నాకు పదవి కాంక్ష లేదంటాడు. కానీ పవన్ గారికి ఏమో ఇప్పడూ సీఎం కావాలని ఉందంటా... అంటున్నాడు. అంటే పవన్ యవ్వారం ఎలా ఉందంటే తానూ చేస్తే శ్రుంగారం అవతలి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది.  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలనుకుంటున్నారు. ఆయన సీనియర్‌ నేత కాబట్టి అదో ప్రత్యేకమైన కథ. వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌ సీఎం కావాలనే కోరిక, ప్రయత్నాలు అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తానే సీఎం అవుతానంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి వారికి చరిత్ర ఉండటం ప్రధాన కారణం. ఈమధ్య వెలువడిన కొన్ని సర్వేలు జగన్‌కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించాయి.


పవన్ మాటలు అర్ధం కాక ప్రజలు తికమక...!

వైకాపా అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉందని తెలియచేశాయి. దీంతో భయంపుట్టిన చంద్రబాబు నాయుడు జగన్‌ను అధికారంలోకి రాకుండా చేయడం కోసం జాతీయ ఫ్రంటు పేరుతో కాంగ్రెసుతో చేతులు కలిపారు. సరే.. ఇదో స్పెషల్‌ రాజకీయమనుకోండి. ముఖ్యమంత్రి పదవి గురించి పవన్‌ గతంలో ఏమన్నారో ఓసారి గుర్తు చేసుకుందాం. పవన్‌ కళ్యాణ్‌ కొన్నిసార్లు తన ముఖ్యమంత్రి కోరికను బయటపెట్టుకుంటాడు. కొన్నిసార్లు తనకు పదవీ వ్యామోహం లేదంటాడు.

పవన్‌కు ఇంత గట్టి నమ్మకమా?

ఒక్కోసారి ముఖ్యమంత్రి పదవి చాలా బాధ్యతగా చేయాలని, తనకు అంత సామర్థ్యం లేదంటారు. ఇలా తనను శక్తిమంతుడిగాను, చేతగానివాడుగానూ రెండు విధాలుగా చెప్పుకుంటారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు 'నాకు సీఎం కావాలనే  కోరిక లేదు. ఆ పదవి చాలా బాధ్యతతో కూడుకున్నది. సరదా కాదు. బాబు, జగన్‌, లోకేష్‌లా బాధ్యతారహితంగా మాట్లాడలేను' అన్నారు. '2019లో సీఎం అవుతానో కాదో తెలియదు. కాని ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాను' అన్నారు. ఒకప్పుడు తన బలమెంతో తనకు తెలియదన్న పవన్‌ 175 సీట్లు సాధించి తీరుతానని, ముఖ్యమంత్రి అవుతానని పోరాటయాత్ర ప్రారంభించినప్పుడు చెప్పారు. '175 స్థానాలు గెలిచి చూపిస్తా' అని ఆవేశంగా ఛాలెంజ్‌ చేశారు. 'నేను జగన్‌ మాదిరిగా నన్ను ముఖ్యమంత్రిని చేయమని ప్రజలను అడగను' అని కొంతకాలం క్రితం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: