అక్కడ హోరాహోరీ జరుగుతోంది. ఢీ అంటే ఢీ అన్నట్లుగా సమరం సాగుతోంది. ఎవరు విజేతలో ఇపుడే తెలియదు కానీ, ఎవరు గెలిచినా లెక్కలు మారిపోతాయి. అలా ఇలా కాదు, దేశ రాజకీయాల్లోనే కీలకమైన మార్పులు వస్తాయి. పొరుగు రాష్ట్రాలకు కూడా ఆ ప్రకంపనలు బలంగానే తాకుతాయి. అందుకే ఆ తీర్పు కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


కూటమితోనే అంతా:


ఏపీ రాజకీయాలన్నీ ఇపుడు తెలంగాణా మీదనే ఆధారపడిఉన్నాయి. మహా కూటమి కట్టిన చంద్రబాబు ఎలాగైనా కేసీయార్ ని ఓడించాలనుకుంటున్నారు. ఆరు నూరైనా కాంగ్రెస్ సర్కార్ ని గద్దెను ఎక్కించాలను చూస్తున్నారు. అది ఆయనకు క్లిష్ట సమయంలో చాలా అవసరంగా మారింది. అక్కడ కనుక పాగా వేయకపోతే రేపటి రోజునా ఆ ప్రభావం ఏపీపైన కూడా పడుతుంది. దాంతో తెర వెనక చెయాల్సింది బాబు చాలానే చేస్తున్నారు. రేపటి విజయం కోసం ఇపుడు మెదడుకు పదును పెడుతున్నారు. 


ఇక్కడ ఆమోదముద్ర పడాలి :


తాను చేసింది ఒప్పు అని బాబు నిరూపించుకోవాలంటే తెలంగాణా ఫలితాలు అనుకూలంగా రావాల్సిందే. ఏ కాంగ్రెస్ తో అయితే బాబు జట్టు కట్టారో, ఏ మూల సిధ్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారో ఆ కాంగ్రెస్ కి సర్వామోదం ఉందని తెలిస్తే బాబు చాణక్యం పట్ల అటు పార్టీలోనూ ఇటు జనాల్లోనూ నమ్మకం కుదురుతుంది. తమ్ముళ్ళు కూడా శభాష్ బాబు సరైన వ్యూహం రచించారు అంటారు. అది కాస్తా ఉల్టా అయితే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు సందేహంలో పడుతుంది. పైగా తమ్ముళ్ళు నేరుగా బాబుపైకి అటాక్ స్టార్ట్ చేస్తారు. అపుడు టీడీపీ నైతికత బాగా దెబ్బతింటుంది.


వైసీపీ ఎదురుచూపు:


అక్కడ బాబు  దగ్గరుండి కట్టిన మహా కూటమి దారుణంగా ఓడిపోవాలని సహజంగానే వైరి పక్షం వైసీపీ కోరుకుంటుంది. బాబు అక్కడ ఓడితే ఇక్కడ చతికిలపడుతారు. ఆయన జాతీయ రాజ‌కీయాలూ అటకెక్కుతాయి. మరో వైపు కేసీయార్ గెలిస్తే వైసీపీకి వేయి ఏనుగుల బలం కూడా వస్తుంది. రేపటి ఎన్నికల్లో కేసీయార్ చాణక్య రాజకీయం పార్టీకి ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఓడిపోతే కనుక వైసీపీకి ఇక్కడ దెబ్బ తగులుతుంది. 
బాబు వీర విజ్రుంభణ చేశ్తారు. ఆ ధాటిని నిలువరించి ముందుకు సాగడం కష్టసాధ్యమవుతుంది.  అందువల్ల ఈ ఫలితాలు వైసీపీకి చాలా ముఖ్యమని చెప్పాలి. ఆలాగే దేశ రాజకీయాలు చూసుకున్నా మోడీకి, రాహులు కి కూడా తెలంగాణా ఫలితాలు చాలా ప్రాధ్యన్యత గా చూడాలి. మరి ఏం జరుగుతుందో, ఓటర్ల మదిలో ఏముందో.



మరింత సమాచారం తెలుసుకోండి: