ఏ దేశంలో లేనంతమంది యువత భారత్ కి ఉన్నారు. కానీ ఇక్కడ రాజకీయం మాత్రం సీనియర్ సిటిజన్ల చేతుల్లోనే ఉంటుంది. ఇందుకు కారణం యువతకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి  లేకపోవడంతో పాటు వారిని కూడా ఫ్యాన్స్ గా మార్చేసి బానిస మనస్తత్వాలకు అలవాటు చేసిన గడసరి రాజకీయం మరో కారణం. మరి ఇక్కడ యువత కూడా ఆలోచించడం మొదలుపెడితే. వారిలోనూ నవ భావాలు వికసిస్తే  భారీగానే సమీకరణలు మారిపోతాయి. 


బాబు తప్పుకోవాలట :


చంద్రబాబు వయసు దాదాపుగా డెబ్బయి ఏళ్ళకు చేరువలో ఉంది. దేశంలో సీనియర్ నాయకుడిగా ఉన్న బాబు ఇంకా ముఖ్యమంత్రి గానే పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎం చేసిన ఆయన విభజన ఏపీకి కూడా తొలి సీఎం అయ్యారు. మళ్ళీ మరో మారు చాన్స్ కోరుతున్నారు. ఏపీలో మరో రెండు పార్టీలు ఉన్నాయి. వాటిని యువ నాయకులు జగన్, పవన్ నిర్వహిస్తున్నారు. ఏపీలో యువజనం కూడా యాభై శాతానికి పైగా ఉన్నారు. మరి వారు యూత్ లీడర్ల వెంట నడుస్తారా వెటరన్ చంద్రబాబు కు జై కొడతారా. జనసేనాని పవన్ మాత్రం బాబు సీనియర్ సిటిజన్ అయ్యారిక చాలు తప్పుకో మంటున్నారు.


అలా జరుగుతుందా:


ఏపీ రాజకీయలను చూసుకుంటే కేవలం 45 ఏళ్ళ వయసులో చంద్రబాబు అప్పట్లో సీఎం అయ్యారు. ఆయనకు ఆ పదవి జనాలు ఇచ్చింది కాదు. అన్న నందమూరిని పక్కకు నెట్టి తీసుకున్నది. అప్పట్లో చంద్రబాబు తాను అతి పిన్న వయసులో సీఎం అయ్యానని చెప్పుకునేవారు. మరి ఇప్పటికి పాతికేళ్ళు గడచిపోయాయి. ఇంకా బాబు తానే సీఎం అంటున్నారు. మరి యువ నాయకులకు చాన్స్ ఉండదా. అదే ప్రశ్న పవన్ వేస్తున్నారు. మీ రాజకీయం చాలు, నవ యువతరానికి అవకాశం ఇవ్వండని డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు. మరి అలా జరుగుతుందా. యువత ఆలోచనలు అలా ఉన్నాయా.


యూత్ ఐకాన్ :


ఈ ఎన్నికల్లో పవన్ యూత్ ఐకాన్ గా జనం ముందుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది. పవన్ కి ఆ స్థాయిలో యూత్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరో నేత జగన్ యూత్ ని ఇలా టార్గెట్ చేసింది ఇప్పటి వరకూ లేదు. యువతరం ఓట్లు ప్రతీ ఎన్నికల్లోనొ అయిదు నుంచి ఎనిమిది శాతం పెరుగుతాయి. వాటిని పట్టుకోవాలని పవన్ చూస్తున్నారు. మరి పార్టీలు, రాజకీయాలు, అభిమానాల మధ్య పవన్ ఆశలు ఎంత మేరకు నేరవేరుతాయో చూడాలి. యూత్ అంటే చంద్రబాబు కూడా తాను పాతికేళ్ళ యువకుడినేని ముందుకు వస్తారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: