ఎన్నికల ప్రచారంలో ఎన్నో జిమ్మిక్కులు మాజిక్కులు చూస్తూనే ఉన్నాం. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాపరెడ్డి అక్కడి టిఆరెస్ అభ్యర్ధి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావుకు ఝలక్ మీద ఝలకులు ఇస్తున్నాడు. చివరకు అటు టిఆరెస్ ప్రముఖుడు హారీష్ రావుకు, ఇటు సార్వం సహా  సార్వభౌముడు, కెసిఆర్ మద్య తనదైన స్టయిల్లో  మిత్రభెదాస్త్రం  తన మాటలతో ప్రయోగించగా అది టిఆరెస్ లో కలవరం సృష్టిస్తుంది. 

onteru pratap kcr harish కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు 'తెలంగాణాలో జరగనున్న ముందస్తు ఎన్నికలు అధికార తెలంగాణా రాష్ట్ర సమితి — టిఆరెస్ ని హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నాయా? అనేది చర్చనీయాంశం అయింది. 

kcr kavita ktr harish కోసం చిత్ర ఫలితం

వీడియో ఒకటి మాత్రం వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది అది ఏ కాలేజీలోనో, ఎక్కడో తెలియదు కానీ, ఈ ఎన్నికల సమయంలో టీరెస్ గుండెల్లో చలిమంటలు పుట్టిస్తుంది. ఎన్నికల సమయం కదా! తమకు తట్టిన ఏ అవకాశాన్ని కూడా ప్రచారాస్త్రంగా మార్చకుండా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యాలన్నీ చాలా వరకూ తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. అందులో భాగంగా ప్రత్యక్షంగా ఒక కళాశాల తరగతి గదుల్లోనే విద్యార్ధులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిజ్ణలు చేయించాయి. అదేంటో మీరూ ఓ సారి చూడండి.

kcr kavita ktr harish కోసం చిత్ర ఫలితం

"ఎన్నో ఆశలతో.. అమరుల త్యాగాలతో, ప్రజలందరూ విద్యార్ధులు, నిరుద్యోగులు అంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తన నిరంకుశపాలనతో అందరి నీ నమ్మించి, మోసంచేసి భ్రష్టుపట్టించి, ప్రత్యేకించి విద్యారంగాన్ని నాశనం చేసిన కెసీఆర్, ఆయన ప్రభుత్వాన్ని గద్దెదించాలని, మేమంతా,  మా కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సహా టీఆర్ఎస్ కు ఓటువేయం అని, వేయించబోమని మనస్పూర్తిగా ప్రమాణంచేస్తున్నాం." అని తీర్మానం చేయించారు. ఈ సమయంలో కొంత మంది విద్యార్దులు నవ్వాపుకోలేక పోయిన దృశ్యాలు సైతం వీడియోలో కనిపించాయి. 

వీడియో చూడండి.  

onteru pratap kcr harish కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: