రాజ‌కీయాల‌న్నాక వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేయాలి. కానీ, ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాలు అస‌లు వ్యూహ‌మే లేకుండా సాగుతున్నాయి. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో కూడా తెలియ‌ని విధంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. వ‌చ్చే  ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే.. సీఎం అవుతాన‌ని చెబుతాడు. మ‌రికొంత సేపు సీఎం అయ్యే అర్హ‌త త‌న‌కు లేదా? అని ప్ర‌శ్నిస్తాడు. కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడ‌దా? అని అంటారు. ఇలా మొత్తానికి సీఎం సీటు చుట్టూ తిరిగిన ప‌వ‌న్ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక‌, ఇప్పుడు ఏ జిల్లాలోకి వెళ్తే.. ఆ జిల్లాలోని టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరుగుతున్నాడు. వాస్త‌వానికి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి ఆయ‌న చేసే ప్ర‌తి కామెంట్‌పైనా ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. 


ఈ నేప‌థ్యంలోప‌వ‌న్ చేస్తున్న ప్ర‌తి కామెంట్‌కు సోష‌ల్ మీడియాలో లైకులు కూడా ప‌డిపోతున్నాయి. అదేస‌మ‌యంలో విమ‌ర్శ‌లు కూడా కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి. నిజానికి రాజ‌కీయాల్లో త‌న‌కు ప్ర‌కాశం పంతులు వంటి వారు ఆద‌ర్శ మ‌ని చెబుతున్నా.. పోరాటంలో చేగువేరా వంటి వారు త‌ల‌మానిక‌మ‌ని చెబుతున్నా.. ఆ రేంజ్‌లో ప‌వ‌న్ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌నే స‌ద్వివిమ‌ర్శ మేధావుల నుంచే వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌న్ కంటే చాలా విష‌యాల్లో చిన్న‌వాడే అయినా.. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఉత్త‌మ‌మైన రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు. ప‌వ‌న్ అభిమానుల‌కు ఇది కొంత ఇబ్బంది క‌రంగానే ఉన్నావాస్త‌వ‌మ‌ని చెబుతున్నారు మేధావులు. 


ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ పోరు యాత్ర చేసిన స‌మ‌యంలో దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రౌడీలు, గూండాలు అని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు కూడా దిగారు. విన‌డానికి ప‌వ‌న్ అభిమాను లకు బాగానే ఉన్నా.. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడు అయిన చింత‌మ‌నేని విష‌యంలో ప‌వ‌న్ చేసింది స‌రికాద‌నే అభిప్రా యం కూడా ఉంది. నిజానికి ఈ వ్యాఖ్య‌ల త‌ర్వాత చింత‌మ‌నేని గ్రాఫ్ పెర‌గ‌డం.. ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యమే అయినా చంద్ర‌బాబు చేయించిన తాజా స‌ర్వేలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చింత‌మ‌నేనిపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేదని తేలిపోయాయి. ఇక‌, ఇటీవ‌ల తునిలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సోద‌రుల‌పై నిప్పులు చెరిగారు. 

Image result for pawan kalyan

దీనివ‌ల్ల కూడా ప‌వ‌న్‌కు ఆయాశ‌మే త‌ప్ప ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ రెండు కార‌ణాలు కూడా ప‌వ‌న్ కు ఊహించిన స్తాయిలో రేటింగ్ పెంచ‌లేక‌పోయాయి. మ‌రివీటిని బ‌ట్టి.. ప‌వ‌న్ త‌న వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది వాస్త‌వంగా క‌నిపిస్తున్న చిత్రం! మ‌రి ఏం చేస్తాడో చూడాలి. రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎవ‌రూ శ‌త్రువులు కారు. రాజ‌కీయ అవ‌స‌రం, అధికార‌మే ప‌ర‌మావ‌ధి. ఈ రెండు లేన‌ప్పుడు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు, వ్యాఖ్య‌ల‌కు దిగడం వ‌ల్ల ప‌వ‌న్‌కు ప్ర‌యోజ‌నం ఉంటుందా?  లేద‌ని తేలాక‌.. వ్యూహం మార్చుకోవ‌డ‌మే ముఖ్యం! ఇదీ ఇప్పుడు ఆయ‌న ముందున్న విష‌యం. మ‌రి ఏం చేస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: