Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 10:46 pm IST

Menu &Sections

Search

మహాకూటమికి బీటలేనా? కాంగ్రెస్-టిడిపి ఊహా సౌధం కూలినట్లేనా?

మహాకూటమికి బీటలేనా? కాంగ్రెస్-టిడిపి ఊహా సౌధం కూలినట్లేనా?
మహాకూటమికి బీటలేనా? కాంగ్రెస్-టిడిపి ఊహా సౌధం కూలినట్లేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా చంద్రబాబు నాయుడి కల అదే అధికార భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి పక్షాలను ఐఖ్యంచేసి, శక్తివంతమైన వ్యతిరేఖ కూటమి నిర్మించటం నెఱవేరేలా లేదు. "కలలు కల్లలు కావటం తథ్యం" అనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధమౌతుంది.  ఆఫ్ట్రాల్ ఒక తెలంగాణాలోనే అదీ రెండు ప్రధాన పార్టీలు టిఆరెస్, కాంగ్రెస్ మద్య పోరాటమున్న చోటే ఇతర తుకడా పార్టీలను ఐఖ్యం చేసి అనుకున్న మహాకూటమిని వాటి మధ్య శాసనసభ స్థానాలను పంచటం ఎన్నికలకు సుమారు ఒక నెల ముందుగా కూడా పూర్తి చేయలేని వాళ్ళు ఇక జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన మోడీ సారధ్యంలోని బిజెపిని ఢీ కొట్టటం సాధ్యమా?  
ap-news-mahakutami-tdp-congress-building-oppositio
₹500 కోట్ల సొమ్ము సరపరా చేసి అదీ 10 -12 స్థానాలకు బేరం పెట్టి సమస్త తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కాంగ్రెస్ పాదాల చెంత పెట్టి టిడిపి తిరుక్షవరం చేయించుకున్నా  టిడిపి-కాంగ్రెస్ తో మిగిలిన పార్టీల సీట్ల పంపకం ఇంకా పూర్తవ్వకపోవటం అత్యంత అప్రతిష్టాత్మకం. ఇక్కడున్న నాలుగు లెదా ఐదు పార్టీలనే కలిపి ఐఖ్యం చేసి ఎన్నికల రణక్షేత్రం లో ప్రత్యర్ధుల ముందు నిలపలేకపోతున్న చంద్రబాబు - అత్యంత దురాశాపరులైన కాంగ్రెస్, తెలుగుదేశం, సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ, తృణమూల్, రాష్ట్రీయ జనత దళ్, లోక్ తాంత్రిక్ జనత దల్, నేషనలిష్ట్ కాంగ్రెస్, జెడియు, జెడిఎస్, ఎంజిపి, ఆప్, డిఎంకె, ఏడిఎంకె ఇలా చిన్న చిన్న ముక్కలు అదీ ఏ ఒక్కరైనా నిస్వార్ధంగా సాదించాలన్న తపన లేని పార్టీలను దురాశా పరుడైన చంద్రబాబుకు సాధ్యం కావటం అతికస్టం. 
ap-news-mahakutami-tdp-congress-building-oppositio
తెలంగాణ ఎన్నికల రణరంగానికి ఇంకా 32 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంకా మహా కూటమి పంచాయితీ తెగలేదు. దీంతో ఇటీవలే కేటీఆర్ ఒక కొత్త వ్యాఖ్యానం చేశారు. అది బాగా పాపులర్ అవుతోంది. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు, మేము స్వీట్లు పంచుకుంటాం, అని. అదే నిజమయ్యేలా ఉంది పరిస్థితి. మహాకూటమికి కోదండరాం అవసరం ఎంతుందో? స్పష్టంగా తెలుసు. ఆయన్న వదులుకోడానికి ఇష్టపడటం లేదు. అలాగని ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొగుడి నుంచి ప్రేమ తప్ప ఖర్చులకు డబ్బులు రావడం లేదన్నట్లుంది కోదండరాం పరిస్థితి. 

ap-news-mahakutami-tdp-congress-building-oppositio
మర్యాదకు మాత్రం ఢిల్లీ స్థాయిలో కూడా తక్కువ లేదు. కానీ సీట్ల విషయంలో గల్లీ స్థాయి ప్రాధాన్యం. ఇక టీడీపీ కూడా ఇంకా సీట్లు కావాలని పట్టుబడుతుండగా – సీపీఐ, ఐదు ఇవ్వమని ఖరాఖండిగా చెబుతోంది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ తో పోలిస్తే మహాకూటమి ప్రచారంలో చాలా వెనుక పడి ఉంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం పూర్తి చేసుకుంది. కానీ మహా కూటమి ఇంకా మొదలే పెట్టలేదు. దీంతో మహాకూటమి అభ్యర్థులు బాగా వెనుకపడిపోతున్నారు.
ap-news-mahakutami-tdp-congress-building-oppositio
మహాకూటమి పొత్తుల్లో అసలు నియోజకవర్గం సీటు మా పార్టీకే దక్కుతుందా? లేదా? అన్న అనుమానం కనీసం 50 నియోజక వర్గాల్లో ఉండటంతో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి రూపాయి విదల్చడం లేదు. దీంతో ప్రచారం ముందు పడటం లేదు. ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఐదేళ్లూ చేసిన అభివృద్ధి కంటే కూడా అభ్యర్థులు చేసే ప్రచారమే జనాలకు బాగా ఎక్కుతుంది. 
ap-news-mahakutami-tdp-congress-building-oppositio
అది ఎదుటివారిని దెబ్బకొట్టడం-సొంతడబ్బా కొట్టుకోవడం అయినా, ఈ రెండు పనులు టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు కేటీఆర్ భారీస్థాయిలో శరవేగంగా చేస్తున్నారు. మహాకూటమి పార్టీల కేడర్, టీఆర్ఎస్ స్పీడు చూసి వణుకుతోంది. వీళ్లను ఢీకొని గెలవగలమా? అన్న సందేహాలు కేడర్ లో మొదలయ్యేటంత ఆలస్యం అయ్యింది. దీంతో కేటీఆర్ చెప్పినట్లే స్వీట్లు పంచుకుంటారేమో! వీళ్ళ సీట్ల గోల తెగేలోగా? 
  ap-news-mahakutami-tdp-congress-building-oppositio
ap-news-mahakutami-tdp-congress-building-oppositio
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
విజువల్లీ ఛాలెంజెడ్ పాత్రలో స్వీటీ అనుష్క మరో రాం చరణ్ కావాలనా?
వాళ్ళు నేరస్తులే-వాళ్ళకు బలహీన కేంద్రం కావాలి-ప్రధాని మోడీ
కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్-గిఫ్ట్ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంది ప్రస్థావన
కులసంఘాలు, స్నేహితుల పేరుతో చంద్రబాబుకు భారీ రిటన్-గిఫ్ట్! ఎన్నికలే ఆలస్యం
ప్రభాస్ - షర్మిల సంబంధంపై పిర్యాదు చేసిన షర్మిల - దీనిలో టిడిపి హస్తం ఉంది
జగన్ పై హత్యయత్నం నేపధ్యంలో ఉన్నది ఆయనేనా?
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్య‌ర్ల‌కు "ఉచితం" గా ఇచ్చేస్తున్నారా?
ఓ మై గాడ్! బాబుగారి ఏపిలో అవినీతి రొచ్చు ఇంత లోతుందా! ఇక మోడీ వదలడు గాక వదలడు!
అన్నా క్యాంటీన్లు వ్యభిచార కేంద్రాలా! పగలు ఆహారం-రాత్రి వ్యభిచారం!!
మిసమిసలాడే యవ్వనం స్వంతం కావాలంటే?
నిప్పులాంటి మనిషి, సచ్చీలురు సిబీఐ ప్రవేశాన్ని నిషేధించరు - బాబుకు ప్రధాని మోది సూటి ప్రశ్న
దేశంలో మరో పానిపట్‌ యుద్ధం తప్పదు!
About the author