Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:26 am IST

Menu &Sections

Search

"ఆ ఒక్క"... ఎమ్మెల్యే తెచ్చిన తంటా.. టీడీపీలో "అల‌జ‌డి"... !

"ఆ ఒక్క"... ఎమ్మెల్యే తెచ్చిన తంటా.. టీడీపీలో "అల‌జ‌డి"... !
"ఆ ఒక్క"... ఎమ్మెల్యే తెచ్చిన తంటా.. టీడీపీలో "అల‌జ‌డి"... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకే ఒక్క‌డు. ఉన్నత విద్యావంతుడు. ప్ర‌జ‌ల జీవితాల‌తో నిత్యం ముడిప‌డిన వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. దీంతో టీడీపీలో ఆయ‌న‌కు పెద్ద‌పీటీ వేశారు. మ‌రింత‌గా పార్టీని అభివృద్ధి చేస్తాడ‌ని, రాబోయే రోజుల్లో పార్టీని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న చేసిన ఆధిప‌త్య రాజ‌కీయం పార్టీని అస్థిర‌త్వం దిశ‌గా న‌డిపిస్తోంది. పార్టీకి వెన్నంటి ఉండి.. పార్టీని అభివృద్ధిలోకి తీసుకు వ‌చ్చిన నాయ‌కుల‌ను సైతం క‌ల‌వ‌ర‌పరుస్తోంది. దీంతో ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ ప‌రిస్తితి ఏంట‌నే ప్ర‌శ్న‌లకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతోంది. అయితే, ఇక్క‌డ క‌లిసి వ‌స్తున్న విష‌యం ఒక‌టే ఒక్క‌టి.. ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ఇక్క‌డ యాక్టివ్‌గా లేక‌పోవ‌డ‌మే!  అదే క‌నుక యాక్టివ్‌గా ఉండి ఉంటే.. ప్ర‌స్తుతం టీడీపీకి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ కొంత మేర‌కు త‌గ్గి ఉండేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

ap-politics-telangana-politics-ap-political-update

ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ జెండా ఎగిరేలా క‌ష్టించిన నాయ‌కులు దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌,  మంత్రి సిద్దా రాఘ‌వ‌రావు, ఏలూరి సాంబ‌శివ‌రావు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు. ఇక్క‌డ పార్టీని అబివృద్ది చేసే విష‌యాన్ని వీరంతా త‌మ భుజాల‌పై వేసుకున్నారు. అంద‌రినీ క‌లుపుకొని వెళ్లారు. ప్ర‌తి కార్య‌క ర్త‌ను పేరు పెట్టి పిలిచేలా వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకునేలా.. ప్ర‌జ‌ల్లో ఐక్యంగా తిరిగేలా వ్య‌వ‌హ‌రిం చారు. ఇక‌, టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌రింత దూసుకుపోయారు. అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న జిల్లాలో అభివృద్ది అంటే ఏమిటో చూపించారు. ముగిసిన అధ్యాయంగా ఉన్న అనేక ప్రాజెక్టుల‌కు ప్రాణం పోశారు. మ‌రి ఇంత‌లా దూసుకుపోయినా.. ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు చాలా ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

ap-politics-telangana-politics-ap-political-update

మ‌రో ఆరుమాసాల్లోనే ఎన్నిక‌లు పెట్టుకుని ఇక్క‌డ ఎన్ని సీట్ల‌లో టీడీపీ గెలుస్తుంది? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం క‌రువ‌య్యే ప‌రిస్తితిని క‌ల్పించింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరే ఇందుకు నిద‌ర్శ‌నం. కొండ‌పి విష‌యానికి వ‌స్తే అక్క‌డ ఎమ్మెల్యే డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ స్వా మి. 2014 ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద గెలిచిన స్వామి.. తొలి ఆరు నెల‌లు బాగానే ఉన్నారు. అయితే, ఆయ‌న ఆ త‌ర్వాత త‌న పంథాను మార్చుకున్నారు. మీరు నాకు చెప్పేదేంటి? అనే రేంజ్‌లో రాజ‌కీయాల‌కు దిగారు. అంతేకాదు, రామ‌లక్ష్మ‌ణులుగా ఉంటూ.. పార్టీని ప‌టిష్టం చేసిన దామ‌చర్ల సోద‌రుల మ‌ధ్య ఎస‌రు పెట్టారు. ఫ‌లితంగా దామ‌చ‌ర్ల స‌త్య స్వామికి మ‌ద్ద‌తుగా త‌న సోద‌రుడు, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జ‌నార్ద‌న్‌పై క‌త్తిక‌ట్టారు. ఆయా విష‌యాలు తెలిసిన సీఎం, పార్టీ అధినేత చంద్ర‌బాబు తాజాగా జ‌నార్ద‌న్‌ను, స‌త్య‌నుకూడా తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

ap-politics-telangana-politics-ap-political-update

అస‌మ్మ‌తి అనే మాట త‌న‌కు వినిపించ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు. ఎమ్మెల్యే డోలా పార్టీ నియ‌మావ‌ళికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంటే.. క‌ఠిన చ‌ర్య‌లుతీసుకోవ‌డం మానేసి ఉదాసీనంగా ఎందుకు వ్య‌వ‌హ‌రించావంటూ.. జ‌నార్ద‌న్‌ను హెచ్చ‌రించారు. ఇక‌పై ఇలాంటివి రారాద‌ని, మ‌రిన్ని అధికారాలు వినియోగించుకునైనా స‌రే డోలా వంటి గ్రూపు రాజ‌కీయాలు చేసేవారిని తెర‌మ‌రుగు చేసినా త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని, పార్టీ మ‌నుగ‌డ‌క‌న్నా త‌న‌కు ఎవ‌రూ ఎక్కువ‌కాద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో దామ‌చ‌ర్ల రాబోయే రోజుల్లో ఇక్క‌డ పార్టీని ప‌టిష్టం చేసే క్ర‌మంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి. 


ap-politics-telangana-politics-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!
సహజసిద్ద ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే...!!!
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...!!!
ట్రంప్ ఆదేశాలతో...ఇండో అమెరికన్ కి కీలక పదవి..!!!