వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంకు  సంబంధించి ఏ 1 నిందితుడెవరో తేలిపోయింది.  వైసిపి ఎంఎల్ఏ రోజా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునే ఏ 1 నిందితునిగా తేల్చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో పోయిన నెల 25వ తేదీన జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ వద్దకు ఓ యువకు వచ్చాడు. జగన్ సరే అనగానే మరింత దగ్గరకు రాగానే కత్తితో దాడి చేశాడు. ప్రమాదాన్ని గ్రహించిన జగన్ వెంటనే పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన పోటు ఎడమభుజం క్రింద దిగింది.

 

ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. చంద్రబాబే హత్యాయత్నం చేయించాడని వైసిపి నేతలు, కాదు తనపై తానే దాడి చేయించుకుని జగన్ డ్రామాలాడుతున్నాడంటూ చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తున్న విషయం అత్యంత జుగుప్సాకరంగా తయారైపోయింది.  జగన్ పై జరిగిన హత్యాయత్నం అత్యంత తీవ్రమైనదని వైసిపి మండిపోతుంటే  జరిగిన దాడి చాలా చిన్న విషయమని, కోడి కత్తి దాడిగా వర్ణించి చిన్నదిగా చూపే ప్రయత్నిస్తోంది తెలుగుదేశం.

 

అదే సమయంలో హత్యాయత్నంకు సంబంధించి వైసిపి నేతలు లేవనెత్తుతున్న అనేక ఆరోపణలకు టిడిపి వైపు నుండి సమాధానాలైతే ఉండటం లేదు. అందుకనే వైసిపి నేతలు రెచ్చిపోతున్నారు. అందులో భాగంగానే రోజా మాట్లాడుతూ హత్యాయత్నం ఘటనలో అసలు చంద్రబాబునే  ఏ 1 నిందితునిగా తేల్చేసింది. హత్యాయత్నం కేసు నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు డ్రామాలాడుతున్నట్లు మండిపోయింది. కేసును డైవర్ట్ చేయటానికే చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నట్లు రెచ్చిపోయింది. కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు ధ్వజమెత్తింది.

 

టిడిపిని తెలుగు దొంగల పార్టీగాను, తెలుగు డ్రామా పార్టీగాను దుమ్మెతిపోశారు. చివరకు టిడిపి అంటే పప్పు పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేయటం గమనార్హం. ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ క్యాంటిన్ కేంద్రంగానే హత్యాయత్నం కుట్ర జరిగితే అసలు క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదంటూ మండిపడ్డారు. తామంతా  జగన్ అభిమానులమని నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో చెప్పించేందుకే ప్రభుత్వం నానా అవస్తలు పడుతున్నా సాధ్యం కావటం లేదంటూ ఆరోపించారు. కత్తి జనవరి నుండే క్యాంటిన్లో ఉంటే పోలీసులు గానీ, క్యాంటిన్ యజమాని కానీ ఎందుకు పట్టించుకోలేదని రోజా పెద్ద లాపాయింటే లాగారు. మరి రోజా ప్రశ్నలకు టిడిపి నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: