మహాకూటమి పేరుతో కెసిఆర్ నాయకత్వంలోని టిఆరెస్ పార్టీని "ఢీ" కొని అధికారం లోకి రావటానికి తెలంగాణా రాష్ట్రం యేర్పాటు చేసిన కాంగ్రెస్ - తెలంగాణాను గత నాలుగు దశాబ్ధాలుగా దోచేసిన తెలుగుదేశం పార్టీ --- ఇప్పుడు వీరితో కలసి తెలంగాణా సాధన కోసం విస్తృతంగా పోరాడిన కోదండ రాం గారి తెలంగాణా జన సమితి అసలు గత ఏడు దశాబ్ధాలుగా దేశానికి ఏ ప్రయోజనాలు సాధించి పెట్టారో? చెప్పలేక పోతున్న సిపీఐ ---- వీరంతా ఇప్పుడు ఒక ఐఖ్య సంఘటన నిర్మించుకొని దానికి మహాకూటమి అని పేరు పెట్టుకొని మరోసారి మరో రూపంలో తెలంగాణా ప్రజలను మాయ చేయటానికి,  ఎన్నికల సమరంగణాన "ఢీ"  కొనబోతున్న తరుణాన కెసిఆర్, టిఆరెస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ తన మాటల శరాలతో మహాకూటమిపై విరుచుకుపడ్డారు.   
  asaduddin in sangareddy meeting కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఈస్ట్ ఇండియా కంపెనీ 2018 గా పోల్చారు.

chandrababu kodandaram కోసం చిత్ర ఫలితం

 "తెలంగాణ రాష్ట్ర మిశ్రమ సంస్కృతిని నాయుడు (ఏపి ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు) కాపాడతారా? పోనీ కాంగ్రెస్ కాపాడుతుందా? ఇది మహాకూటమి కాదు! 2018 ఈస్ట్ ఇండియా కంపెనీ అని సంగారెడ్డి లో జరిగిన ఒక కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ ప్రజలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించు కుంటారని, ఎక్కడో నివసించే వ్యక్తులు కాదని అన్నారు.

'నాయుడు విజయవాడలో ఉంటారు.
ఆర్ఎస్ఎస్ నాగపూర్‌లో ఉంటుంది.
కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటుంది.

వీళ్లా తెలంగాణ, తెలంగాణ ప్రజల తలరాతను నిర్ణయించేది?" అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ్నించి వచ్చిందో తిరిగి అక్కడికి పంపించేలా డిసెంబర్ 7న ప్రజలు తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే,

mahakuTami కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: