Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 11:39 am IST

Menu &Sections

Search

‘జనతా గ్యారేజ్’స్ఫూర్తి..కత్తితో యువకుడి హల్ చల్!

‘జనతా గ్యారేజ్’స్ఫూర్తి..కత్తితో యువకుడి హల్ చల్!
‘జనతా గ్యారేజ్’స్ఫూర్తి..కత్తితో యువకుడి హల్ చల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో అన్యాయం జరిగిన వారికి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి బాధితులను రక్షించే బాధ్యత జనతా గ్యారేజ్ చేస్తుంది.  ఈ జనతా గ్యారేజ్ మొదట మోహన్ లాల్ నడిపిస్తే..తర్వాత ఎన్టీఆర్ వారసత్వంగా కొనసాగిస్తుంటాడు.  ఇది సినిమా..చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తుంది.  కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్ అని చెప్పి ఓ ఆకతాయి రెచ్చిపోయాడు.
janatha-garage-inspiration-guntur-tadepally-undava

ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయడంతోపాటు ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంత వరకు బాగానే ఉన్నా సదరు వ్యక్తి కత్తి పట్టుకొని రోడ్డు పై హల్ చల్ చేయడంతో అక్కడున్న వారు బెంబేలెత్తిపోయారు.  స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   తాడేపల్లి మండలం ఉండవల్లిలో ప్రదీప్ అనే యువకుడు ‘జనతా గ్యారేజ్’సినిమా స్ఫూర్తిగా తీసుకొని తాను సమాజాన్ని ఉద్దరిస్తానని..అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తానని రోడ్డుపై చేతిలో కత్తితో హల్ చల్ చేశాడు. 
janatha-garage-inspiration-guntur-tadepally-undava
తాను ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని సెటిల్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ వివాదంపై రోడ్డు పై కత్తి పట్టుకొని హల్ చల్ చేశాడు. ఇతను గతంలో పలు నేరాలకు పాల్పడినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  ప్రదీప్ ఉండవల్లిలో కత్తిని చేతిలో పట్టుకుని గట్టిగా ఫోన్ లో మాట్లాడుతూ కనిపించాడు. దాంతో అక్కడ ఉన్న స్థానికులు భయ కంపితులై  పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


janatha-garage-inspiration-guntur-tadepally-undava
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ