తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  వచ్చే నెల 7 న జరగబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీ అధినేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.  అధికార పార్టీ టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ది తమను గెలిపిస్తుందని..బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని..కల్లబొల్లి మాటలకే పరిమితం అయ్యిందని..ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి.

Image result for టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో

మరోవైపు టి కాంగ్రెస్, టి టీడిపి, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడబోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జేఎస్ అధినేత  ఎన్నికల గుర్తు ‘అగ్గిపెట్టె’ను ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.   ఈ సందర్భంగా  టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశామని, ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపుతున్నట్టు చెప్పారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆమోదం తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ కాపీలను మరో మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు. 

Image result for టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో

టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో :

- అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ
-అధికారంలోకి వచ్చిన ఏడాదే లక్ష ఉద్యోగాల ప్రకటన, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన
-నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ.3వేల భృతి
-అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసుల ఎత్తివేత
-అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు
-పరువు, కులం పేరుతో జరిగే హత్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు
-ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు రద్దు చేస్తాం
-విధానపరమైన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచేలాపారదర్శక ప్రజాస్వామిక పాలన
-ఇందిరాపార్క్ ధర్నా చౌక్ పునరుద్దరణ
-ప్రగతిభవన్‌ను తెలంగాణ మ్యూజియంగా ప్రకటన
-ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను రద్దు చేస్తాం
-ప్రజలందరికి ఉచిత విద్య, వైద్య సదుపాయం
-వ్యవసాయ నైపుణ్యా అభివృద్ది పెంచేలా చర్యలు
రాష్ట్రంలో పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు
-కౌలుదారులకు కూడా ప్రభుత్వ పథకాల వర్తింపు
-ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కటుంబాలకు పరిహారం
-సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ కాంట్రాక్టర్లకే అప్పగిస్తాం
-రైతు వ్యతిరేక 2016 భూసేకరణ చట్టం రద్దు చేస్తాం.. 2013 చట్టం తెస్తాం




మరింత సమాచారం తెలుసుకోండి: