రాజ‌కీయాల‌ను శాసించిన పార్టీ.. కాంగ్రెస్‌. దేశంలో ఎమ‌ర్జెన్సీని విధించి ప్ర‌జాస్వామ్యాన్ని గుప్పెట్లో మూసి పెట్టిన జాతీయ పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అలాంటి పార్టీ.. చిన్నా చిత‌కా పార్టీలతో జోడు క‌ట్టి .. ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్తితి వ‌చ్చింది. ము ఖ్యంగా టీడీపీ వంటి బ‌ద్ధ వ్య‌తిరేక శ‌త్రువుతో నూ చేతులు క‌లిపింది. 2014 ఎన్నిక‌ల స‌మయంలో ఇదే టీడీపీ.. కాంగ్రెస్‌ను తూర్పార బ‌ట్టింది. ఏపీలో కాంగ్రెస్‌కు నిలువ నీడ కూడా లేకుండా చేయాలంటూ. చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు. అంతే కాదు, రాష్ట్రాన్ని పార్ల‌మెంటు త‌లుపులు మూసి విభ‌జించిన పిరికి పంద‌లు అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. అయితే, రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు అనేలా.. చంద్ర‌బాబు వెళ్లి.. కాంగ్రెస్ చంక‌లో దూరారు. 


వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి.. రాహుల్‌ను ప్ర‌ధాని చేయ‌డ‌మే ఏకైక అజెండా గా ఆయ‌న ముందుకు వెళ్లారు. ఇక‌, దీనిని స‌మ‌ర్దించుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌- అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. రాజ‌కీయ అనివార్య‌త అంటూ.. మ‌రో అనుప‌ల్ల‌వికి ప్రాణం పోశారు. ఇలా బాబు దూసుకుపోయేందుకు, తాను ఏం చేసినా.. క‌రెక్టేన‌ని చెప్పుకొనేందుకు వెనుకాడ‌డం లేదు. అయితే, రాజ‌కీయాల్లో అంద‌రూ బాబు మాదిరిగా ఉండ రు క‌దా?!  కాంగ్రెస్‌లో కొంద‌రు నాయ‌కులు దాదాపు 30 నుంచి 40 ఏళ్లుగా చ‌క్రం తిప్పుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు వీరు చంద్ర‌బాబుతో పొత్తును తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు. 


టీడీపీ ఏనాడూ కాంగ్రెస్ ఫేవ‌ర్‌గా మాట్లాడ‌లేద‌ని, కాంగ్రెస్ఓటు బ్యాంకును చీల్చిల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నించింద‌నేది వీరి ఆగ్ర‌హం. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ నాలుగున్న‌రేళ్లలో చేస్తున్న అవినీతి, ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న ప్ర‌జాధ‌నం లూటీల‌ను కేవీపీ రామ‌చంద్ర‌రావు వంటి వారు బ‌హిర్గ‌తం చేస్తున్నార‌ని, ఇలాంటి వారి నోరు మూయించేందుకు చంద్ర‌బాబు ప‌న్నిన ఉచ్చులో రాహుల్ గాంధీ ప‌డిపోయార‌ని అంటున్న సీనియ‌ర్లు కూడా ఉన్నా రు.

ఈ  క్ర‌మంలోనే ప‌లువురు సీనియ‌ర్లు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే రెండు వికెట్లు ప‌డిపోయాయి. సీరామ‌చంద్ర‌య్య‌, వ‌ట్టి వ‌సంత కుమార్‌లు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాబోయే రోజుల్లో మ‌రింత మంది ముఖ్యంగా క‌నుమూరి బాపిరాజు,కేవీపీ రామ‌చంద్రరావు వంటి వారు కూడా బ‌య‌ట‌కు వ‌స్తే.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: