వైసిపి ఎంఎల్ఏ రోజా చెప్పినట్లుగా తెలుగుదేశంపార్టీ నేతలది శునకానందంగానే కనబడుతోంది.  లేకపోతే కర్నాటక రాష్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓడిపోతే ఏపిలో టిడిపి నేతలు సంబరాలు చేసుకోవటం ఏంటి ? ఇంతకీ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నది కర్నాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనా ? లేకపోతే బిజెపి ఓడిపోయిందనా ? పైగా కర్నాటక ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని జోస్యం కూడా చెప్పేస్తున్నారు. వీళ్ళాత్రం మండినట్లే ఉంది.


కర్నాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జెడిఎస్ కూటమి గెలిచిందంటే అందుకు వాళ్ళు అక్కడ అధికారంలో ఉండటమే. ఉప ఎన్నికల్లో మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీకే ఫలితాలు సానుకూలంగా ఉంటాయనటంలో సందేహం అవసరం లేదు. పైగా సంకీర్ణ ప్రభుత్వం కూడా ఈమధ్యనే అధికారంలోకి వచ్చింది. బహుశా సంకీర్ణ ప్రభుత్వంపై ఇంకా జనాల్లో వ్యతిరేకత మొదలవ్వలేదేమో ? దానికితోడు ప్రత్యర్ధి పార్టీ చాలా గట్టిది కాబట్టి కాంగ్రెస్, జెడిఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుంటారు. అందుకనే సంకీర్ణ కూటమి ఉప ఎన్నికల్లో విజయం సాధించింది.


అంతమాత్రానా కర్నాటక ఉపఎన్నికల ఫలితాలకు తెలంగాణా ముందస్తు ఎన్నికల ఫలితాలకు ముడేస్తే ఎలా ? కర్నాటక రాజకీయం వేరు తెలంగాణాలో జరుగుతున్నది వేరన్న విషయం టిడిపి నేతలకు తెలీదా ? తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇపుడే ఎవరూ చెప్పలేకున్నారు. అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చెంపపెట్టన్నారు. అలాగే కర్నాటకలో ఫలితాలే తెలంగాణాలో కూడా పునరావృతమవుతాయని చెబుతున్నారు. నిజానికి కర్నాటక ఉప ఎన్నికల విజయంతో కాంగ్రెస్ నేతలు ఆనందపడినా అర్ధముంది. కానీ విచిత్రంగా టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు.  దాన్నే శునాకనందమంటారేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: