తెలంగాణాలో ఓ వైపు ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. మరో వైపు మహా కూటమి సీట్ల పంచాయతీ ఎక్కడా తేలడంలేదు. కాంగ్రెస్ లో ఉన్న ఆశావహులు జోరు చూస్తే మొత్తం 119 సీట్లు చాలేట్లు లేవు.  ఇక పొత్తుల పేరిట కాంగ్రెస్ త్యాగాలు చేస్తే పాతిక వరకు కొరతా వస్తుంది. తెలంగాణా జన సమితి, సీపీఐ మాత్రం గట్టిగానే పట్టుపట్టడం చికాకుగా మారుతోంది.

డిల్లీకి సీన్ :


కాంగ్రెస్ సీట్ల పంచాయతీ డిల్లీకి మారింది. ఇంకోవైపు కాంగ్రెస్  లో అభ్యర్ధుల జాబితా వడపోత కూడా జోరుగా సాగుతోంది. ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలనంది తేలకముందే హస్తం నేతలు ప్రచారం మొదలెట్టేశారు. తమకు సీటు గ్యారంటీ అని భావిస్తూ రంగంలోకి దిగిపోతున్నారు. ఇక డిల్లీలో స్క్రీనింగ్ కమిటీ పేరిట కాంగ్రెస్ ఉద్దండులు జాబితా రూపకల్పనలో బిజీగా ఉన్నారు. మొదట రెండు విడతలుగా అభ్యర్ధుల పేర్లను విడుదల చేయాలనుకున్నా మారిన పరిస్థితుల్లో ఒకేమారు అన్ని సీట్లకు పోటీ చేసే కాంగ్రెస్ జాబితా విడుదల చేయాలనుకుంటున్నారు.


అమావాస పోయాకేనట:


ముంగిట్లో అమావాస్యను పెట్టుకుని అభ్యర్ధుల జాబితా విడుదల చేయడం కాంగ్రెస్ కి కూడా ఇష్టం లేనట్లుంది రెండు రోజులు ఆగి మొత్తం లిస్ట్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ఆశావహులతో ఇపుడు డిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ కళకళలాడుతోంది. ఇక మరో వైపు కూటమిలో కుమ్ములాటలు ఇంకా తీరలేదు. కాంగ్రెస్ నుంచి ఎక్కువ సీట్లను సీపీఐ, తెలంగాణా జన సమితి డిమాండ్ చేస్తున్నాయి. కనీసం పదికి తక్కువ అయితే కూటమి నుంచి పక్కకు పోతామని కోదండరాం మాస్టారు చెబుతున్నా ఎనిమిది సీట్లు ఇచ్చినా చాలు అంటున్నట్లుగా ఇంటర్నల్ టాక్.  సీపీఐ విషయానికి వస్తే ఆరు ఎమ్మెల్యే కోరుతున్నా నాలుగు ఇస్తే సర్దుకుపోయేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఎమ్మెల్సీ కూడా రెండు కోరుతున్నారట.


కాంగ్రెస్ కి నైతక బలం :


ఈ పోరు ఇలా ఉండగానే పొరుగున ఉన్న కన్నడ సీమలో ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతల్లో ఎక్కడలేని ధీమా పెరిగిపోయింది. ఇపుడు పేచీ పెట్టే పార్టీలతో గట్టిగానే మాట్లాదేందుకు కాంగ్రెస్ కి ఈ ఫలితాలు అవకాశం ఇచ్చాయి. అదే టైంలో అటు కోదండరాం, ఇటు చాడ వెంకటరెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ అనుకూల వాతావరణం చూసి వెనక్కు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి చూసుకుంటే దీపావళి తరువాత మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి అయి అభ్యర్ధుల ఫైనల్ లిస్ట్ బయటకు 
వస్తుందని  అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: