జగన్ మీద జరిగిన దాడి చిన్నదే అయినప్పటికీ జగన్ ఇంత వరకు పాదయాత్ర మొదలు పెట్టలేదు. అయితే ఇదే విషయం మీద అధికార పార్టీ కూడా ఆలోచిస్తుంది.  గాయం చిన్నదే కదా, మరెందుకు వైఎస్‌ జగన్‌ ఇన్ని రోజులపాటు పాదయాత్రకు విరామం తీసుకుంటున్నారు.? అన్న అనుమానాల్ని అధికారపక్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినప్పుడు అధికారపక్షం తొలుత ఆ దాడిని తీవ్రంగా ఖండించాలి.. వైఎస్‌ జగన్‌ని పరామర్శించాలి. ఇవేవీ చేయకపోగా, పబ్లిసిటీ కోసం జరిగిన 'దాడి'గా జగన్‌పై జరిగిన హత్యాయతాన్ని అభివర్ణించి, అధికారపక్షం తన స్థాయిని దిగజార్చేసుకుంది.

గాయం చిన్నదే.. కానీ, జగన్‌ ఎందుకిలా.?

హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న జగన్‌ చేతికి గాయమవడం, ఆ గాయానికి హైద్రాబాద్‌లో వైద్యచికిత్స పొందడం తెల్సిన విషయాలే. కోడి పందాల కోసం వినియోగించే కత్తిని 'హత్యాయత్నం' కోసం నిందితుడు వాడటంతో, వైద్యులు జగన్‌కి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా గాయం ఇంకాస్త పెద్దదయ్యింది. కండరానికి లోతుగా గాయమవడంతో, కొన్ని రోజులపాటు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు చెప్పారు.

Image result for jagan

మామూలుగా అయితే, వైఎస్‌ జగన్‌ రెండోరోజు నుంచే పాదయాత్రకు వెళ్ళి వుండేవారేమో. కానీ, గాయం తీవ్రత.. పైగా, జనంలో వుండాలి గనుక ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలుండడంతో కుటుంబ సభ్యులు, వైద్యుల ఒత్తిడి మేరకు, జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు దూరంగా వున్నారు. పంటి సమస్య కోసం విదేశాలకు వెళ్ళి, ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా, వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై వెటకారాలు చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇదిలా వుంటే, ప్రజాసంకల్ప యాత్రకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌, సోషల్‌ మీడియాలో అభిమానుల్ని ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. తాను కోలుకుంటున్నాననీ, త్వరలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుందనీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: