పవన్ కళ్యాణ్ తల్లి ని దూషించినప్పుడు పవన్ కు మీడియా కు చిన్న పాటి యుద్ధమే జరిగింది అందుకే అప్పుడప్పుడు సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంటాడు.  కొన్ని మీడియా చానెళ్లపై ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తనను ప్రత్యేకించి టార్గెట్ చేసి వార్తలు ప్రసారం చేస్తున్నారని పవన్ అప్పట్లో ఆరోపించారు. దాదాపుగా ట్విట్టర్ నే తన అనధికారిక మీడియా చానెల్ గా మార్చుకున్న పవన్....తనపై దుష్ప్రచారం చేసిన చానెళ్లపై సంచలన ట్వీట్లు చేశారు.


పవన్ పనికిమాలిన మాటలతో తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడు...!

కొన్ని మీడియా చానెళ్లపై సుదీర్ఘమైన న్యాయపోరాటం చేయబోతున్నానని పవన్ అన్నారు. ఆ సమయంలో పవన్ కు కొన్ని మీడియా చానెళ్లకు మధ్య మినీ వార్ జరిగింది. కొందరు చానెళ్ల అధిపతులు పవన్ పై కేసుల వరకూ వెళ్లారు. తాజాగా మరోసారి పవన్...మీడియా చానెళ్లపై మండిపడ్డారు. ‘వేల కోట్లు దోచుకుంటున్న మైనింగ్ కంపెనీ ‘ఆండ్రూ’ యజమానిని తాను లఫూట్ అని తిడితే వరుసగా డిబేట్లు పెట్టారని - ప్రధాని మోదీ తల్లిని బాలకృష్ణ తూలనాడితే డిబేట్లు పెట్టరని మండిపడ్డారు.


తనకు వేల కోట్ల డబ్బులేదని - చానెళ్లు లేవని....జనసైనికులే తన చానళ్లు - పత్రికలు - ఫేస్ బుక్ లు అని పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. మైనింగ్ కంపెనీ ‘ఆండ్రూ’ అక్రమాలపై మండిపడ్డ పవన్...ఆ కంపెనీ యజమానిని లఫూట్ అని తిట్టిన సంగతి తెలిసిందే. పవన్ అలా తిట్టడంపై కొన్ని తెలుగు చానళ్లలో డిబేట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్...మీడియా పై పవన్ ధ్వజమెత్తారు. ‘ఆండ్రూ’ యజమానిని తాను లఫూట్ అని నేను తిడితే డిబేట్లు పెట్టారని - కానీ - మోదీ తల్లిని బాలకృష్ణ తూలనాడితే డిబేట్లు పెట్టరని పవన్ మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: