తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.  మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరిగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి.  టీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ ప్రచారం జోరుగా కొనసాగిస్తుంది.  105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే గత నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు పరిచామని..ప్రజలకు అధికార పార్టీకే మళ్లీ పట్టం కడతారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 

మరోవైపు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టీటీడిపి, టీజేఎస్, సిపిఐలను కలుపుకొని ‘మహాకూటమి’గా ఏర్పడేందుకు సిద్దం అయ్యింది.  గత కొన్ని రోజుల నుంచి కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం జరుగుతోందని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి మండిపడ్డారు.  రగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. కుదిరితే ప్లాన్ ఎ, లేకపోతే ప్లాన్ బి అమలు చేస్తామని మరోసారి హెచ్చరించారు. మరో ముందడుగేసి తాము పోటీ చేయాలనుకుంటున్న 9 స్థానాలను ప్రకటించారు.

 మహాకూటమి ఏర్పాడి ఇన్ని రోజులైనా ఇంతవరకు సీట్ల సర్దుబాటు కాలేదు. దీంతో సీపీఐ, టీజేఎస్ కాంగ్రెస్ వ్యవహారంపై మండిపడుతున్నాయి. తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి. కగా గత రెండు రోజులుగా కాంగ్రెస్ కూటమి పార్టీలతో భేటీలు నిర్వహించింది. సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: