తెలంగాణలో టీఆర్ఎస్ ని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పంతం పట్టిన కాంగ్రెస్ ఇతర పార్టీలైన టీజేఎస్, టిటిడిపి, సిపీఐలను పొత్తు పెట్టుకొని మహాకూటమిగా నెలకొనబోతుంది.  ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ విషయంపై ఢిల్లీలో పంచాయతీ కూడా నడుస్తుంది.  మొత్తానికి మహాకూటమిలో భాగంగా టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా టీజేఎస్ కు షాక్ ఇచ్చేలా ఒక మెలిక పెట్టింది.   

ఆ 11 స్థానాల్లో పలు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ షరతు విధించినట్లు సమాచారం. ఈ షరతుకు టీజేఎస్ ససేమిరా అంది. కాంగ్రెస్ షరతు కుదరదంటూ టీజేఎస్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

అంతే కాకుండా కాంగ్రెస్ ప్రతిపాదిత సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై జనసమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించకపోవడంపై కూడా ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: