రాజకీయాల్లో గెలవటానికి ప్రభుత్వాలు ఏర్పరచటానికి పార్టీలు పొత్తులు పెట్టుకోవటం సర్వ సాధారణం. కానీ తెలంగాణలో తాజాగా నడిచే కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ, తెలంగాణా జన సమితి, కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల పొత్తు రాజకీయం మాత్రం గత నెలరోజుల నుంచి ప్రజలందరికి విసుగు తెప్పిస్తుంటే, ఇంకొందరిలో అనేక అనుమానం, సంశయం కలిగిస్తోంది. 
mahakutami alliance in telangana not yet finalised కోసం చిత్ర ఫలితం
ఈ పొత్తు పొద్దు పొడుతుస్తుందా లేదా? ఈ నాలుగు పార్టీల ప్రవర్తన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటూ ఒక నెల రోజుల నుంచి జీడిపాకంలాగా కొనసాగుతూనే ఉంది. ఇందులో అసలు తెలంగాణాలో ఏమాత్రం ఉనికి ఉందో కూడా తెలియని టిడిపి తాను కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంది, దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ ఎన్నికలకయ్యే ఖర్చు సుమారు ₹500 కోట్లవరకు భరించనుందనే సమాచారం. దానికింద ముష్టి పద్నాలుగు సీట్లు టిడిపికి కేటాయించింది కాంగ్రెస్. 
mahakutami alliance in telangana not yet finalised కోసం చిత్ర ఫలితం
ఇక టిజేఎస్ మరియు సీపీఐ పార్టీలు విసుగెత్తి ఉన్నాయి. ఇక్కడ టిజేఎస్ కు కోదండ రాం తో కొంత బెటర్ ఎడ్జ్ కలిగి ఉంది. ఇక సిపి ఐ కూటమి నిర్లక్ష్యంతో విసుగును భరించలేక పోతుంది అంతే కాదు తాము పోటీ చేయనున్న 9 స్థానాల వివరాలు ప్రకటించి కాంగ్రెస్ కు సరైన సమయంలో ఘట్తిగానే ఝలక్ ఇచ్చింది. తొలినుంచి తమకు ఐదు గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే పొత్తుకు ఓకే అని సీపీఐ చెబుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం "వాళ్లు గెలవలేరు అనవసరంగా సీట్లు అడుగుతారు" అంటూ నంగనాచి వ్యాఖ్యలు చేస్తుంది. దీనిపై ఈరోజు సిపీఐ సీనియర్ నేత కంకణాల నారాయణ వేసిన ప్రశ్నకు కాంగ్రెస్ మూలాల్లో బాంబులు పేలిపోయాయి.  
mahakutami alliance in telangana not yet finalised కోసం చిత్ర ఫలితం

"తమ పార్టీ (సిపీఐ) ఏ సీటు అడిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అంటుంది. కాంగ్రెస్ పోటీ చేయాలనుకున్న అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుస్తుందా? దాన్ని కాంగ్రెస్ పార్టీ రాసివ్వగలదా?" అని సిపీఐ నారాయణ ప్రశ్నించారు.
cpi narayana question to congress about allience in telangana కోసం చిత్ర ఫలితం
నిజానికి ఇలాంటి "లాజిక్ ప్రశ్న" సీపీఐ నుంచి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఊహించలేదు. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదు. అంతే కాదు అస్సలు ఆ మాట కొస్తే దీనికి సమాధానం ఏ పార్టీ కూడా సమాదానం ఇవ్వలేదు కూడా!
mahakutami alliance in telangana not yet finalised కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్ మహా కూటమి లోని పార్టీలకు సీట్ల కేటాయింపు ఇంకా ఇంకా ఆలస్యం వల్ల సమయం అనవసరంగా వృథా అయిపోతోంది. ఏ స్థానాలు వస్తాయో తెలియకపోతే కూటమిలోని పార్టీలు ఎలా ప్రచారం చేసుకుంటాయనేది సరైన ప్రశ్నే. అధికారపక్షం ఇప్పటికే ఎన్నికల ప్రచారములో మహా కూటమి కంటే ఎన్నో యోజనాల దూరంలో ముందుంది. ఒక మంచి కలిసొచ్చే అవకావాన్ని కాంగ్రెస్ మీన మేషాలు లెక్క పెడుతూ ఇలా నాశనం చేసుకుంటే మహా కూటమి ఎలా గెలుస్తుంది? అంటూ సీపీఐ ప్రశ్నిస్తోంది. కరక్టే కదా! 

cpi narayana question to congress about allience in telangana కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: