తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ అది నాయకుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిపై మరియు తన కుటుంబ బంధాలపై ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అనేక పరిశ్రమలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుమార్తె తో సమావేశాలు నిర్వహించడం జరిగింది.

Image result for ktr

ఈ సమావేశంలో ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తో కేటీఆర్ అద్భుతంగా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కూడా కేటీఆర్ తానేంటో రుజువు చేసుకున్నారు. ఈ క్రమంలో త్వరలో రెండు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి పార్టీలపై తాజాగా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Related image

ఇదే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారు రక్త సంబంధాలను కూడా లెక్కచేయకుండా సీఎం పదవి కోసం ఆరాట పడుతున్నారని చేస్తున్న కామెంట్లపై తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్..తనకు సిఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి గోడవలు లేవని ఆయన స్పష్టం చేశారు.

Related image

మేమంతా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కూడా కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుభంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడు వీడబోమని కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: