ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు ఆ రాష్ట్రంపై అనేక విమర్శలు రావడం జరిగాయి. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై గతంలో అనేక వివాదాలు దేశవ్యాప్తంగా జరిగాయి.

Related image

దళితుల పట్ల కాటినంగా  మరియు హిందువులకు యోగి ఆదిత్యనాథ్ అండగా ఉంటున్నారు అంటూ.. వేరొక విశ్వాసం కలిగిన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఒక నిర్ణయం దేశ రాజకీయాలలో మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

Related image

ఒకానొక సమయంలో దేశంలో ముస్లింలు మరియు హిందువుల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య విషయమై అనేక అల్లర్లు..గొడవలు.. కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల కొన్ని జిల్లాలకు మరికొన్ని వాటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందువుల పేర్లు పెడుతూ తన పాలన సాగిస్తున్నారు.

Image result for yogi adityanath

అయితే తాజాగా ఆయన ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తున్నట్లు ప్రకటించారు. తమకు గర్వకారణమైన అయోధ్య పేరును జిల్లాకు పెట్టడం సరైనదన్నారు. ఈ మేరకు అయోధ్యలో జరిగిన దీపావళి వేడుకల్లో ఆయన ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే అయోధ్యలో ఎయిర్ పోర్టు నిర్మించి… రాముడి పేరు, వైద్య కళాశాల ఏర్పాటు చేసి రాముడి తండ్రి దశరధుడి పేరు పెడతామని ఆయన పేర్కొన్నారు. దీంతో తాజాగా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం దేశంలో అనేక చర్చలకు తెరలేపింది.




మరింత సమాచారం తెలుసుకోండి: