ఈ సామెతతో కొందరికి కష్టం కలగవచ్చేమో గాని ఇది నిజం అని ప్రతిక్షణం నిరూపించబడుతుంది. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడావిడి అన్నట్లు దేశంలో ఎక్కడ బిజెపి అపజయం సాధించినా ఈ పచ్చపార్టీ వాళ్ళు పండగ జేసుకుంటారు అందుకే ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. 
pavan modi babu కోసం చిత్ర ఫలితం
అటు బిజెపి ఇటు టిడిపి మరోప్రక్క జనసేన 2014లో కలసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టించాయి. అందరూ అన్నిరకాల వాగ్ధానాలు చేశారు. విభజన ఫలాలైన ప్రత్యేక హోదాతో కలిపి 18 వాగ్ధానాలు కేంద్రం ప్రభుత్వం చేసి, ఏ వాగ్ధానాన్ని నెఱవేర్చక పోగా తిత్లీ తుఫాన్ తో ప్రభావానికి తీవ్రనష్టం చవిచూసిన సిక్కోలు ప్రజలకు ఏమీ చేయలేక పోయింది. కారణం ఈ రాష్ట్రానికి బిజెపిని బద్ధ శత్రువుగా మార్చిన చంద్రబాబే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. చంద్రబాబు కాకుండా వేరెవరైనా, అది తెలుగుదేశం వాళ్ళైనా సరే,  బహుశ ఆంధ్రప్రదేశ్ ఎంతో కొంత ప్రయోజనం పొంది ఉండేది. 
chandrababu natakalu కోసం చిత్ర ఫలితం
600 వాగ్ధానాలు అనాలోచితంగానో గెలుపే ప్రాధమ్యంగానో ఎడాపెడా చేసేసిన నారా చంద్రబాబు తెలుగుదేశం, 60 ప్రయోజనాలైనా నెఱవేర్చక పోయినా ఈయన గెలుపుతో ప్రజల నెత్తిన దరిద్రం ముఖ్యమంత్రి రూపంలో రాష్ట్రానికి అరిష్టదాయకంగా మారింది. పవన్ కళ్యాన్ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ప్రశ్నించ లేక వైఫల్యం చెందారు.
jds congress success inkarnataka made chandrababu happy కోసం చిత్ర ఫలితం
ఈ విధంగా టిడిపి ప్రభుత్వం కుడి ఎడమల వైఫల్యం చెంది నాలుగేళ్లు బిజెపి మైత్రితో టిడిపి సభ్యులంతా స్వప్రయోజనాలు చూసుకున్నారు. ప్రత్యేక హోదా అంటూ కొంతకాలం, అదేమీ సంజీవని కాదంటూ, మరి కొంతకాలం గడిపేసి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుండి స్వప్రయోజనాలు ఇబ్బడి ముబ్బడిగా పొంది, ఇక ప్రయోజనాలు రావని బిజెపి వీరిపట్ల ఒట్టిపోయిన గొడ్దని భావించిన తరుణంలో ఎన్ డి ఏ కి ఝలక్ ఇచ్చి బయటపడింది  ప్రజలను మాయలో పడేసింది.  చివరికి ఆంధ్రప్రదేశ్ చేతికి ఒక చిప్ప ఇచ్చేశారు. 
sambarala chandrababu కోసం చిత్ర ఫలితం
అంతేకాదు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ధర్మపోరాటం, న్యాయపోరాటం, అవిశ్వాసం అంటూ దాదాపు ఆరునెలలుగా సమయాన్ని వృధాచేస్తూ వస్తున్నారు. ఏపికి ప్రజల యోగ క్షేమాల కంటే చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో బిజెపి ఓడిపోవటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు తాను కారణం అయినా కాకపోయినా బిజెపి ఓడిన ప్రతిచోటా నేపధ్యంలో ప్రతిపక్షాల ఆపద్భాందవుడుగా ఉంటున్నట్లు రాష్ట్రంలో పచ్చ మీడియా విసుగు విరామం లేకుండా ప్రచారం చేస్తుంది. 
chandrababu natakalu కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థితుల్లో నిన్న కర్ణాటక లో బిజెపి ధారుణ పరాజయాన్ని తెలుగుదేశం విజయంగా, "చంద్రబాబు చాణాక్యం" ప్రొజెక్ట్ చేయటం చూస్తుంటే పచ్చమీడియా "తెలుగుదేశం కోసమే గాని, ప్రజల కోసం మాత్రం కాదని, బల్ల గుడ్డి చెప్పవచ్చు"
jds congress success inkarnataka made chandrababu happy కోసం చిత్ర ఫలితం
కర్నాటక ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జొష్ పెంచితే - టిడిపి సంబరాలు చేసుకుంటుంది

అంటే "ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడావిడి" అన్నట్లే కదా! ఈ "సంబరాల చంద్రబాబు" బిజెపి వైఫల్యాన్ని పండగ చేసుకుంటూ ఉంటే ఇక ఏపికి ఎలాంటి ప్రయోజనం కూర్చే దేనినైనా చేయటానికి బిజెపి సహకరించకపోవచ్చు. ఫలితం రాష్ట్రం నష్టపోవటం సంపూర్ణం అని చెప్పక తప్పదు.  
సంబంధిత చిత్రం
కర్నాటకలోని ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఒకింత జోష్ వచ్చిందనడంలో సందేహం లేదు. మూడు ఎంపీ-రెండు ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి రెండు ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్యే స్థానాల్లో నెగ్గగా, బిజెపి కేవలం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్ కు తీపి కబురే వారు సంబరాలు చేసుకోవటానికి అర్హులే. ఇంతవరకు బాగానే ఉన్నా, కర్ణాటక ఫలితాలు చూసి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు  జబ్బలు చర్చుకోవటమే విడ్డూరంగా ఉంది. 
chandrababu natakalu కోసం చిత్ర ఫలితం
వీరిని చూస్తుంటే వాపును చూసి బలుపు అనుకున్న చందంగా ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఒక అడుగు ముందుకేసి బిజెపి గెలిచిన ఒక్క స్థానం కూడా కోట్లాది రూపాయిల కట్టలు విరజిమ్మి గెలిచినదట. మిగిలిన నాలుగు స్థానాలు కాంగ్రెస్-జెడిఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా కైవసం చేసుకున్నాయట. ఇవే ఫలితాలు రానున్న ఎన్నికల్లో రిపీట్ అవుతాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపును టీడీపీ బలుపుగా చిత్రీకరిస్తున్నాడు.

chandrababu natakalu కోసం చిత్ర ఫలితం

భారత దేశ ఎన్నికల చరిత్రలో ఉపఎన్నికల ఫలితాలెప్పుడూ అధికార పార్టీ కుర్చీ చుట్టూ తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అవే ఫలితాలు వచ్చాయి. మరో ఆరు స్థానాలు కైవసం చేసుకుంటే అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉన్న బిజెపి వైఫల్యాన్ని ఇక్కడ కాదనలేం. కానీ పులిని చూసి నక్కవాత పెట్టుకున్న ట్లు ఈ ఫలితాలతో రాస్ఝ్ట్రంలోని లోని తెలుగుదేశం పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమిటో అర్థం కాని పరిస్థితి.

life time enimies TDP-Congress కోసం చిత్ర ఫలితం
ఆజన్మ శత్రువులైన కాంగ్రెస్-టీడీపీలు ప్రస్తుతం పొట్టలో కత్తులు పెట్టుకుని భాయి భాయి అంటూ ఆలింగనం చేసుకుంటు న్నారు. అవకాశవాద రాజకీయాలపై పొడిచిన కాంగ్రెస్-బిజెపి పొత్తు వీరి అసంబద్ధ విధానాలతో ఎప్పుడు అస్తమిస్తుందో, ఎప్పుడు ప్రకాశిస్తుందో, చెప్పవలసిన వారు - అటు బిజెపి సుబ్రహ్మణ్యేశ్వరుడు - ఇటు కాంగ్రెస్ చిదంబరేశ్వరుడు - మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: