Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 5:33 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : టిఆర్ఎస్ రెబెల్స్ కు రూ 5 కోట్లు..కెసియార్ కు షాక్ తప్పదా ?

ఎడిటోరియల్ : టిఆర్ఎస్ రెబెల్స్ కు రూ 5 కోట్లు..కెసియార్ కు షాక్ తప్పదా ?
ఎడిటోరియల్ : టిఆర్ఎస్ రెబెల్స్ కు రూ 5 కోట్లు..కెసియార్ కు షాక్ తప్పదా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముందస్తు ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితిని దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు భారీ వ్యూహం రచించారా ? జగన్ మీడియా చెబుతున్నదాని ప్రకారం అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.  టిఆర్ఎస్ ఓటమినే లక్ష్యంగా చంద్రబాబు పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. బలమైన నేతలను గుర్తించి టిఆర్ఎస్ అభ్యర్ధులకు పోటీగా రెబెల్స్ గా ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్లాన్ వేశారట. ఇప్పటికి సుమారు 70 నియోజకవర్గాల్లో అటువంటి నేతలను గుర్తించినట్లు తెలుస్తోంది. వారందరికీ మహకూటమి కానీ లేకపోతే తెలుదేశంపార్టీ కానీ ఫైనాన్స్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ప్రతీ రెబల్ అభ్యర్ధికి సుమారు రూ 5 కోట్ల వరకూ ఫైనాన్స్ చేయాలని కూడా నిర్ణయమైనట్లు సమాచారం.

 

ప్రతీ నియోజకవర్గంలోను గ్రామస్దాయి నుండి అవసరమైన సమాచారాన్ని చంద్రబాబుకు చేరుతోందట. టిఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన అంశాలేవి ? అభ్యర్ధుల్లో బలహీనతలేంటి ? రెబల్ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుంది ? లాంటి కీలకమైన అంశాలపై చంద్రబాబుకు మద్దతుగా ఉండే మీడియా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందట. దాని ప్రకారం అందుబాటులో ఉన్న నేతల్లో గట్టి నేతలను రెబల్ గా పోటీలోకి దింపాలని నిర్ణయమైందట.

 

ఇఫ్పటికే పోటీలోకి దింపాల్సిన రెబల్ అభ్యర్ధుల జాబితా కూడా రెడీ అయ్యిందట. ప్రతీ నియోజకవర్గంలో సొంతంగా 10 వేల ఓట్లను తెచ్చుకోగలిగిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారట. ముందస్తు ఎన్నికల్లో ఎవరు గెలిచినా చాలా నియోజకవర్గాల్లో పెద్దగా మెజారిటీ అవకాశాలు లేవు. ఏ నాలుగైదు వేల మెజారిటీ గెలిచే నియోజకవర్గాలే చాలా ఉంటాయి. పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా అటువంటి నియోజకవర్గాలను గుర్తించారు.


 

అదే సమయంలో ప్రస్తుతం టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్దుల్లో చాలామందిపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్రస్ధాయిలో నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకుని టిఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్నది లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. మళ్ళీ టిఆర్ఎస్ గెలిస్తే ఓటుకునోటులో కదలిక వస్తుందేమోనని, విచారణ పేరుతో ఏపిలో జరగబోయే ఎన్నికల్లో తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడుతున్నారు. ఓటుకునోటు కేసులో ఎటువంటి కదలిక ఉండకూడదంటే తెలంగాణాలో టిఆర్ఎస్ ఓడిపోవాలన్న ఏకైక వ్యూహంతోనే పావులు కదులుతోంది.

 

ముందస్తు ఎన్నికలు మొదలైన దగ్గర నుండి అవసరం ఉన్నా లేకపోయినా ఓటుకునోటు కేసును ప్రధానంగా కెసియార్ ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఓటుకునోటు కేసు లక్ష్యంగా చంద్రబాబును కెసియార్, హరీష్ రావు, కెటియార్ అమ్మనాబూతులు తిడుతున్న విషయం చూస్తున్నదే. నిజానికి చంద్రబాబు తెలంగాణాలో తిరగలేకపోతున్నా, కెసియార్ పై ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కవటమే కారణం. తెలంగాణాలో అయితే కేసులో కదలిక లేకుండా చూసుకోగలరేమో కానీ సుప్రింకోర్టులో ఫిబ్రవరి నుండి మొదలవ్వనున్న విచారణను అడ్డుకోగలరా ?  

 

 


telangana-polls-trs-rebals-contesting-chandrababu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసిపిలో చేరిన టిడిపి ఎంఎల్ఏ..మేడా సస్పెన్షన్
హోదాకు సంతకాలు తీసుకోగలరా ?
అగ్రవర్ణాల మధ్య చంద్రబాబు చిచ్చు
ఎడిటోరియల్ :  రిజర్వేషన్లపై చంద్రబాబు సరికొత్త మోసం
ఎడిటోరియల్ : జగన్ పై విషం చిమ్ముతున్న మంత్రులు
ఎడిటోరియల్ : వంగవీటికి అంత సీన్ ఉందా ?
ఎడిటోరియల్ : రాధా రాజీనామా ఎఫెక్ట్..బోండాలో టెన్షన్
ఎన్ఐఏ విచారణే..తేల్చేసిన హై కోర్టు
ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తు పిటీషన్
వైసిపికి వంగవీటి రాజీనామా
ఎన్ఐఏ కేసులో చంద్రబాబుకు షాక్
 ‘యాత్ర’ బయోపిక్ లో జగన్ ?
సత్తెనపల్లిలో అంబటికి పొగ పెడుతున్నారా ?
‘బ్రీఫింగ్’ తర్వాతే విచారణకు హాజరయ్యారా ?
ఎడిటోరియల్ : ఎన్నికల్లోపు టిడిపిలో కీలక మార్పులు
ఎన్ఐఏ వల్లే విదేశీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారా ?
జగన్ పై దాడి కేసు...పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న టిడిపి
ఎడిటోరియల్ : చంద్రబాబుపై తలసాని ఎఫెక్ట్
ఎడిటోరియల్ : జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా ఏంటో తెలుసా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.