పోయేదేం లేదు. నమ్మితే లాభం, నమ్మకపోతే వచ్చే నష్టమూ లేదు. మాట ఇచ్చెస్తే సరి పోతుందిగా, ఇదీ మన నయా రాజకీయం. హామీలతో  గాలి మేడలు కట్టేసి జనాలను అందులో కూర్చోబెట్టేస్తే చాలు, మిగిలిన కధంతా మనకు అనుకూలమే, మరి ఎన్నో సార్లు ఇలాంటి సినిమాలు  చూసి విసిగి వేసారిన జనాలు మరో మారు నమ్మేస్తారా.


మెట్రో కధ  మళ్ళీ మొదలు  :


విశాఖకు మెట్రో రైలు.. ఇది ఆరేళ్ళ నాటి కధ. అప్పట్లో కేంద్రంలో యూపీయే, ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాఖ పెద్ద సిటీ కాబట్టి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను నాడు యూపిఏ మంజూరు చేసింది దానికి సంబంధించి డీపీయార్ తయారు చేసే పనిలో ఉండగా విభజన చేశేశారు. ఆ తరువాత ఏపీలో చంద్రబాబు సీఎం కాగానే మెట్రో రైలు విజయవాడ  కావాలన్నారు. అలా  విశాఖకు బ్రేక్ పడింది.


పట్టించుకోలేదుగా :


ఇక కేంద్రంలో మోడీ, ఏపీలో బాబు జోడీ అధికారంలోకి వచ్చాక విశాఖ మెట్రో పరుగులు తీస్తుందని అనుకున్నారు. అయితే పీపీపీ పద్ధతిలో చేపడతామని చెప్పారు. అది కూడా అడుగు ముందుకు పడలేదు. ఇంతలో రెండు పార్టీలూ రాజకీయాలు చేయడం, చివరకు విడిపోవడం జరిగిపోయాయి. ఇపుడు ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఆదరా బాదరాగా టీడీపీ ప్రభుత్వం విశాఖ మెట్రో అంటూ మళ్ళీ ముందుకు వచ్చింది. పీపీపీ విధానంలో చేపడతామని పాత పాట పాడింది.


జస్ట్  హామీగానే :


ఇపుడు ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన దాన్ని జస్ట్ హామీ గానే చూడాలని విపక్షాలు అంటున్నాయి. నిజానికి టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ళుగా ఏం చేస్తున్నారని కూదా ప్రశ్నిస్తున్నారు. ఇపుడు ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమీ లేక పాత హామీకి మెరుగులు దిద్ది మరో మారు జనం ముందుకు రావాలనుకుంటున్నారని, ఇది నమ్మరని కూడా అంటున్నారు. 


నిజానికి టీడీపీ ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పట్టలెక్కించాలన్నా 8 వేల పై చిలుకు నిధులు అవసరం అవుతుతాయి. ప్రైవేట్ పార్టనర్స్ రావాలి అన్ని అగ్రిమెంట్లు కుదరాలి. రంగంలోకి దిగాలి అంటే ఎన్నికలు ఈలోగా వచ్చేస్తాయి. సో, ఇది పక్కా ఎన్నికల హామీయేనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: