వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలుసా ? తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుండే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. బహుశా మెగాస్టార్ చిరంజీవి ఓడిపోయిన పిఠాపురం నుండే పోటీ చేసి గెలవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. ఈ విషయం జనసేనలో ఇంకెవరో చెప్పటం కాదు. పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ  స్వయంగా ప్రకటించారు. పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుని ఆశీస్సులుంటే తాను పిఠాపురం నుండే పోటీ చేస్తానని చెప్పారు.


సరే, తాను పోటీచేయబోయే నియోజకవర్గం గురించి ఇప్పటికే పవన్ చాలా మాటలు చెప్పారు. రాయలసీమలో వెనుకబడిన అనంతపురం నుండి పోటీ చేస్తానని గతంలో తానే చెప్పారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. దాంతో ఏలూరులో  పోటీ చేస్తారన్నంత కలరింగ్ ఇచ్చారు. తనను తిరుపతి  నుండి పోటీ చేయాల్సిందిగా అభిమానులు ఒత్తిడి పెడుతున్నట్లు ఒకసారి చెప్పారు. ఉత్తరాధ్రలోని ఏదో ఓ నియోజకవర్గం నుండి తనలాంటి వాళ్ళు పోటీ చేస్తే కానీ  ఈ ప్రాంతం అభివృద్ధి జరగదా ? అంటూ చంద్రబాబునాయుడును నిలదీశారు. దాంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది.

 

ఇలా ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం నుండి పోటీ చేస్తానన్నట్లుగా సంకేతాలు పంపటం పవన్ కు అలవాటైపోయింది. జనసేన వర్గాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ మందున్నారట. కాబట్టే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. సో, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై వ్యూహాత్మకంగా లీకులిస్తున్నట్లున్నారు. మొత్తానికి ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారో లేదో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: