పాపం గనులరెడ్డిగా పాపులర్ అయిన గాలి జనార్ధన రెడ్డికి ఎంత కష్టమొచ్చిందో ? గాలి జానర్ధన రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఎందుకంటే, గాలి పరారీలో ఉన్నారు కాబట్టి. పరారీ కావాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటంతోనే గాలికి కష్టాలు మొదలైనట్లు సమాచారం.  అక్రమ మైనింగ్ కేసులపైన గాలిపైన చాలా కేసులే ఉన్నాయి. ఆ కేసుల్లో నుండి బయటపడేందుకు గాలి అంబిడెండ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారట.

 

ఇంతకీ ఆ ఒప్పందం ఏమిటంటే, గాలిపై ఉన్న ఎన్ఫోర్స్ మెంటు కేసుల్లో నుండి తప్పిస్తానని అంబిడెంట్ కంపెనీ గాలితో ఒప్పందం చేసుకున్నదట. డీల్ మొత్తం కోటి రూపాయలు. నిజానికి గాలిపై ఉన్న కేసులు, స్టేలు, కేసులు ఎత్తేయటాలకు కోటి రూపాయల డీల్ అంటే చాలా చాలా తక్కువనే చెప్పాలి. వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు(అక్రమ ?)చేసిన గాలికి కోటి రూపాయలు నిజంగా లెక్కే కాదు. నిజ్జంగా చెప్పాలంటే ఒక్క నెల ఖర్చనే చెప్పాలి.

 

అటువంటది అంబిడెంట్ కంపెనీతో కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకోవటం ఏమిటి ? అది కాస్త బయటపడిపోవటం ఏమిటి ? అంబిడెంట్ కంపెనీ ద్వారా గాలి ఇచ్చిన లంచం ఈడి అధికారులకు అందిందట. కేసులో నుండి గాలి బయటపడతారో లేదో తెలీదు కానీ లంచం ఇచ్చిన విషయం మాత్రం బయటపడిపోయింది. దాంతో ఈడి ఉన్నతాధికారులు గాలిపై మరో కేసు పెట్టి అరెస్టు చేయటానికి వచ్చారు. ఆ విషయం తెలుసుకోగానే వెంటనే గాలి పరారయ్యారు. దాంతో ఈడి, పోలీసులు గాలి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.


గతంలో కూడా ఓబుళాపురం మైనింగ్ కేసులో నుండి బెయిల్ ద్వారా బయటపడేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టులో ఏకంగా 14 మంది జడ్జిలకు కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిన విషయం బయటపడిన విషయం తెలిసిందే. మొత్తానకి టైం బావోలేకపోతే తాడే పామై కరుస్తుందన్న సామెత గాలి జనార్ధనరెడ్డి విషయంలో రుజువవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: