తెలుగు ఇండస్ట్రీ లో బూతు కంటెంట్ సినిమా లలు ఎక్కువైయ్యాయని చెప్పాల్సిందే. అర్జున్ రెడ్డి, rx 100 సినిమా ల ప్రభావం తో బూతు కంటెంట్ సినిమాలను జనాల్లోకి వదులుతున్నారు.  సినిమాలో కంటెంట్ ఏముందనే విషయాన్ని పక్కనపెట్టి పోస్టర్ లో మాత్రం బోల్డ్ చూపిస్తే చాలనుకుంటున్నారు. టాలీవుడ్ లో కొత్తగా పుట్టుకొచ్చిన 'బోల్డ్' అనే ట్రెండ్ కు పరాకాష్ట ఈ టైటిల్, ఈ పోస్టర్.

Image result for rayalaseema love story

రాయలసీమ లవ్ స్టోరీ పేరుతో రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ఇది. రాయలసీమ అనగానే సినిమా వాళ్లకు ఫ్యాక్షనిజం గుర్తొస్తుందని, కానీ అదే రాయలసీమలో అందమైన ప్రేమకథలు కూడా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ ప్రేమకథకు ఈ పోస్టర్ ను లింక్ చేయడం అస్సలు బాగాలేదు. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అని చెబుతూ, ఫైవ్ స్టార్ హోటల్ బ్యాక్ డ్రాప్ లో ఇలా బాత్ టప్ లో హీరోహీరోయిన్లను పచ్చిగా చూపించడం అస్సలు బాగాలేదు. రాయలసీమలో ప్రేమకథలంటే ఇలానే ఉంటాయా..? కేవలం ఇలాంటి ఫొటోలు చూపిస్తే సినిమాలు ఆడేస్తాయనే భ్రమలో ఉన్నారు చాలామంది మేకర్స్.

Image result for rayalaseema love story

ప్రారంభంలో ఇలాంటి పనులు అందరి దృష్టిని ఆకర్షించొచ్చు. కానీ అల్టిమేట్ గా సినిమా ఆడాలంటే కంటెంట్ ఇంపార్టెంట్. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్-100 సినిమాలు బోల్డ్ గా ఉన్నప్పటికీ అందులో ఉన్న కంటెంట్ జనాలకు నచ్చింది. పులినిచూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఈ రెండు సినిమాల్ని చూసి రెచ్చగొట్టే పోస్టర్లతో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడతాయనుకోవడం అవివేకం. రీసెంట్ గా వచ్చిన రథం అనే సినిమా ఇలానే చేతులు కాల్చుకుంది. ఇప్పుడీ సినిమా కూడా రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: