పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువేనని చెప్పాలి. తన స్పీచ్ ల్లో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే రాజకీయాల్లో అంత ఆవేశం పనికి రాదని చెప్పాలి. అయితే పవన్ మాట్లాడే తీరు పరిణితి కలిగిన రాజకీయ నాయకుడి లాగా కనిపించకపోవడం పవన్ మీద ప్రజలకు నమ్మకం కలగడం లేదు. పవన్ నేను ఎన్టీఆర్ అంత మంచోణ్ని కాదు. మా అన్నకు వెన్నుపోటు పొడిచినోన్ని వదిలి పెట్టను లాంటి ఎమోషన్ మాటలు రాజకీయాల్లో తగవు.  ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన అన్నయ్యను - కుటుంబాన్ని - కాంగ్రెస్ని వద్దనుకొని టీడీపీకి మద్దతిచ్చానని...ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్నారని పవన్ మండిపడ్డారు.


పవన్ కన్ఫ్యూషన్ తో జనాలకు పిచ్చెక్కిపోతుంది...!

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ వద్దని ప్రజలు తరిమి కొట్టారని కాంగ్రెస్ హఠావో నినాదంతో తాను టీడీపీని గెలిపించానని కానీ నేడు చంద్రబాబు...రాహుల్ తో కలవడం ఏమిటని నిప్పులు చెరిగారు. 2009 లో ఏం పీకారు.. ఇప్పుడు ఏం పీకుతారు అనే మాటల మధ్య తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తన పై చెత్త ప్రోగ్రామ్స్ చేయిస్తూ మరోవైపు దోపిడీ చేస్తుంటే ఎదురు తిరగకుండా ఎలా ఉంటామని అన్నారు. అవినీతికి పాల్పడితే చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలను నడిరోడ్డు పైకి లాక్కొస్తానని హెచ్చరించారు. చంద్రబాబు `వెన్నుపోటు`పొడిస్తే పొడిపించుకోవడానికి తాను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదని ఎవరూ భయపడాల్సిన పనిలేదని పవన్ అన్నారు.


జనసైనికులంతా అప్రమత్తంగా ఉండాలని దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతానికి  సంయమనం పాటించాలని అవసరమైన రోజు తాను చెప్తానని ఆ తర్వాత మీ ఇష్టమని పవన్ చెప్పారు. తాను ఆచితూచి మాట్లాడుతానని ఒక దోపిడీదారుడిని లఫూట్ అన్నందుకు డిబేట్లు పెట్టారని కొన్ని చానెళ్ల పై మండిపడ్డారు. ఎవరు ఎవరితో పడుకున్నారు అనేది న్యూసా అని ప్రశ్నించారు. ఈ పనికిమాలిన వార్తలు అని పవన్ అన్నారు. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తినని రెండు చేతులతో గులాంగిరి చేసే వాడిని కాదని అన్నారు. కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఉన్న నాయకులే ఆ పార్టీని వీడుతుంటే...చంద్రబాబు మాత్రం వారి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: