తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి ఈ సారి అధికారం దక్కనివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో మహా కూటమిగా ఏర్పడిన విషయం మనకందరికీ తెలిసినదే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతుండగా మిగిలిన ఇరవై నాలుగు స్థానాలకు కూటమిలో ఉన్న పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.

Image result for telangana mahakutami

14 స్థానాలను టీడీపీ, మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే టీజేఎస్ మాత్రం తమకు 11 స్థానాలను కావాలని కోరుతోంది.

Related image

సీపీఐ కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను కోరుతోంది. అయితే వారు అనుకున్న‌న్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా క‌నిపించ‌డంలేదు. దీంతో మహాకూటమిలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య ముఖ్యంగా టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం కాంగ్రెస్ పార్టీ వైఖరిపై చాలా కోపంగా ఉన్నట్లు తెలంగాణా రాజకీయాలలో వార్తలు వినబడుతున్నాయి.

Image result for telangana mahakutami

మరోపక్క వామపక్ష పార్టీలు అని సిపిఐ కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికలు రాకముందే పోటీచేసే స్థానాలలో మహాకూటమిలో గొడవలు ఏర్పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: