చాలా కాలంగా చూస్తూంటే జాతీయ రాజకీయాలు, నాయకులు మనకు అసలు  దేశంలో  ఉన్నారా అనిపించకమానదు. ఇందిరాగాంధి, వాజ్ పేయి తరువాత జాతీయ నేతలు అని ఎవరినీ పిలవడానికి కూడా అవకాశం లేదని తలపండిన రాజనీతికారులు చెబుతారు. దేశమంతా ఆసేతు హిమాచలం తెలిన పార్టీ, నాయకులు మాత్రమే జాతీయ హోదా సంపాదించుకుంటారు. ముప్పయి సీట్లు ఉన్న పార్టీ నుంచి కూడా ముఖ్యమంత్రులు అవుతున్న ఈ కాలంలో అందరూ జెండా ఎగరేసే వారే. అజెండా మాత్రం అడగొద్దంటారు.


మళ్ళీ బాబు టూర్లు :


గత వారం హస్తిన టూర్ చేసి హల్ చల్ స్రుష్టించిన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఇపుడు దక్షిణాది రాష్ట్రాల టూర్ వేయబోతున్నారు. ఈ రోజు బెంగలూర్, చెన్నై వెళ్ళి ప్రాంతీయ పార్టీ నాయకులను బాబు కలుస్తారు. వారితో ముచ్చట్లు పెడతారు. రేపటి ఎన్నికల్లో కొత్త కూటములపై చర్చిస్తారని టీడీపీ వర్గాల సమాచారం. భేష్, బాగానే ఉంది కొత్త కధ.


దేవగౌడతో భేటీ :


చంద్రబాబు కర్నాటక వెళ్ళి మాజీ ప్రధాని దేవగౌడతో, ఆయన కుమారుడు, అక్కడ సీఎం కుమారస్వామితోనూ భేటీ అవుతున్నారు. నిన్నటి ఉప ఎన్నికల్లో గెలిచినందుకు వారిని ఆయన అభినందిస్తారు. అటునుంచి తమిళనాడు వెళ్ళి డీఎంకే అధినేత స్టాలిన్ ని కూడా బాబు కలుస్తారని, ఆయనతో జాతీయ రాజకీయలపై చర్చిస్తారని టాక్.  మొన్ననే ఓ జాతీయ సర్వేలో స్టాలిన్ కి  తమిళనాట 29 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది.


వాళ్ళను కలిస్తే వచ్చేదేంటి :


బాబు పార్టీకి ఏపీలో 5 ఎంపీ సీట్లు వస్తాయని అదే జాతీయ సర్వే చెప్పేసింది. మరి స్టాలిన్ ని కలిస్తే బాబు ఇక్కడ గెలిచిపోతారా, లేక కుమారస్వామి, దేవగౌడలతో భేటీ అయితే వారి విజయంలో కొంత టీడీపీకి ఇస్తారా అని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. అక్కడ పరిస్తితులు బట్టి ఆయా పార్టీల గెలుపు అవకాశాలు ఉన్నాయి. వారిని కలసి వస్తే బాబు పార్టీకి నైతికంగా మద్దతు వస్తుందేమో కానీ రాజకీయంగా ఎలా కలసివస్తుందన్నది  చూడాలి. 
ఇక కూటములు అంటూ ఇపుడు బాబు ఎంతగా తిరిగిన రేపటి ఎన్నీకల తరువాత ఎవరెటు ఉంటారన్నది ఆయ రాష్త్రాల ప్రయోజనాలు, పార్టీల రాజకీయ లాభాలను బట్టి ఆధారపడి ఉంటుంది. . ఒకవేళ వచ్చే ఎన్నికల్లో  మోడీ పార్టీ మెజారిటీకి దగ్గరలో వస్తే తమిళ ప్రయోజనాలు పేరు చెప్పి ఇదే స్టాలిన్ కలవకుండా ఉందగలరా. అందువల్ల బాబు ఈ లేటెస్ట్ టూర్లన్నీ మీడియా లో టీడీపీ బూస్టింగుకు మాత్రమే ఉపయోగపడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: