Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Apr 23, 2019 | Last Updated 3:25 am IST

Menu &Sections

Search

హరీష్ రావు ను 'వంటేలు' పోయిస్తున్న 'వంటేరు' - భలే బ్లాక్-మెయిల్ రాజకీయం!

హరీష్ రావు ను 'వంటేలు' పోయిస్తున్న 'వంటేరు' - భలే బ్లాక్-మెయిల్ రాజకీయం!
హరీష్ రావు ను 'వంటేలు' పోయిస్తున్న 'వంటేరు' - భలే బ్లాక్-మెయిల్ రాజకీయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణా రాష్ట్ర సమితి-టిఆరెసులో గుత్తాధిపత్యం వహిస్తున్న "ఆ నలుగురు" లో రాజకీయమే కాదు, సమర్ధవంతమైన ట్రబుల్షూటర్ కూడా అయిన తన్నీరు హరీష్ రావు - ప్రజల్లో ఉంటే ఆయన నీళ్ళలో ఉన్న మొసలి కున్నంత పట్టుకలిగి ఉంటారు. అలాంటి హారీష్ రావును ముగ్గురు ఒకటై ఆయన్ని పక్కన పెట్టేశారనె బలమైన వదంతి ప్రచారంలో ఉంది. ఆ పరిస్థితులనేకం ప్రజల సమక్షంలోనే పలుమార్లు వివిధ వేదికలపై కనిపించాయి. 
telangana-news-telangana-pre-polls-2018-kcr-vs-van
ఇప్పుడు, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు - కేసీఆర్ బరిలోకి దిగే గజ్వేల్ నియోజకవర్గం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేస్తుండటం చాలా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఓటమే తన జీవిత లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న వంటేరు ప్రతాప రెడ్డికి గజ్వేలు నియోజకవర్గంలో మంచి పలుకుబడి పరువు ప్రతిష్ట అంతకు మించి పట్టు ఉంది. కేసీఆర్ ను ఓడించటం ద్వారా ఆయన ఈసారి సంచలనం సృష్టించాలని సడలని పట్టుదలతో వంటేరు ప్రతాపరెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. 


హరీష్ రావు తన మేనమామ కేసీఆర్ బరి లోకి దిగనున్న గజ్వేల్ నియోజకవర్గం పై మరింత ఫోకస్ చేశారు. తన నియోజకవర్గ ప్రచారాన్ని తన గెలుపు పై ఆత్మవిశ్వాసంతో వదిలేసిన హరీష్ రావు, తన మేనమామ కేసీఆర్ విజయం కోసం గజ్వేల్ లో  పెద్దఎత్తున వ్యూహ ప్రతివ్యూహలతో పావులు కదుపుతున్నారు. దీంతో ఈ పోటీ హారీష్ వర్సెస్ వంటేరు అన్నతీరుగా మారిపోయింది. ఇటీవల కాలంలో హరీశ్ రావుపై వంటేరు ప్రతాప రెడ్డి, తన మేనమామను ఓడించాలని హరీశ్ రావు తనతో చెప్పినట్లుగా వంటేరు ప్రతాపరెడ్డి సంచలనం సృష్టించేలాగా వెల్లడించటం, దీనిపై హరీష్ రావు చాలా తీవ్రంగా స్పందించటం జరిగిపోయింది.  
telangana-news-telangana-pre-polls-2018-kcr-vs-van
అయితే ఇప్పుడు కూడా హరీష్ పై వంటేరు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మేనమామకు షాకిచ్చేలా కొందరు రాజకీయ ప్రముఖులతో రహస్య మీటింగ్ పెట్టినట్లుగా కేసీఆర్ అండ్ కో హరీష్ రావును అనుమానిస్తున్న తరుణంలో, అందుకు బలం చేకూరేలా వంటేరు తాజా వ్యాఖ్యలు ఉండటం గమనించటగ్గ విషయం. గతంలో తానూ, హరీష్ రావు రెండుసార్లు కలిసి చర్చించుకున్నారని పుకార్లు షికార్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. 


ఒక ప్రైవేటు నెంబరు నుంచి హరీష్ రావు తనకు కాల్ చేశారని, ఆయన మాట్లాడిన దానితో సహా అన్నింటికి ఆధారాలు తనవద్ద నిక్షేపంగా ఉన్నట్లుగా చెబుతున్న వంటేరు ప్రతాప రెడ్డి తమ మధ్య జరిగిన రెండు సమావేశాలు హైదరాబాద్ లోనే జరిగాయన్నారు. అవసరం అనిపించిన చోట సమయం, సందర్భం కలసి వచ్చినప్పుడు తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని బయటకు వెల్లడిస్తానని చెప్పారు.


హరీష్ రావుతో వ్యక్తిగతంగా జరిగిన రెండు సమావేశాల విషయంపై తాను ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసి చెప్పగలనని అందుకు ఆయన హరీష్ సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు. ఇదే ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది.
telangana-news-telangana-pre-polls-2018-kcr-vs-van

ఈ మద్య ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే హరీష్ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వంటేరు, రాష్ట్ర నాయకుడు, ప్రతిష్టాత్మక మంత్రి ఇలా ఒక గ్రామనాయకుడిగా ఎలా మారారని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు లాంటి రాష్ట్రస్థాయి నాయకుడు గ్రామస్థాయి నాయకుడైన తనతో పోటీ పడటం, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రముఖులు కొందరు తెలంగాణలో గొప్ప గొప్ప కాంట్రాక్టర్లు ఎవరూ లేనట్లు, ఆంధ్రా గుత్తేదార్లతో కుమ్మక్కు అయ్యారని, క్వశ్చన్ చేశారు. గడిచిన 17 ఏళ్లలో హరీశ్ ఆస్తులు ఏ విధంగా పెరిగిపోయాయో గుర్తించాలన్న ఆయన, తన ఆస్తుల గురించి హరీష్ రావు తనలా నిర్ధిష్టమైన ప్రకటన చేయగలరా? అంటూ హరీష్ రావుకు ఊపిరి సలపకుండా సవాళ్ల  మీద సవాళ్లు విసురు తున్నారు. 

telangana-news-telangana-pre-polls-2018-kcr-vs-van

telangana-news-telangana-pre-polls-2018-kcr-vs-van
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అవకాశాల కోసం ఫ్లడ్-గేట్లు ఎత్తేసి అందాల ఆరేస్తున్నారా! పారేస్తున్నారా!
చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?
తెలంగాణా ఇంటర్ బోర్డ్ ఫెయిలైంది - విద్యార్దులు కాదు!
నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు
ఎన్నికల పోరు రసవత్తరం! వివాదాల రారాజు పై వెండితెర అందాల రాణి పోటీ
విష వలయంలో విశాఖ: విస్తరించిన రేవ్ పార్టీల విష సంస్కృతి! ఇక విలయమే
చంద్రబాబు దెబ్బకు పునేఠా ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత రికార్డుల్లో 'రెడ్-మార్క్స్'
మూడో దశ పోలింగ్ లో "బంగారు కోడి పెట్ట"!
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
సిఎం - సిఎస్ మద్య సాండ్-విచ్ అయిపోతున్న అధికారులు! పని సంస్కృతి వారికి తెలియదా?
రధి ప్రియాంక - సారధి చంద్రబాబు - అప్పుడు నరేంద్ర మోదీకి కనిపించేది నక్షత్రాలే!
వారణాసి నుండి ప్రియాంక గాంధి, నరేంద్ర మోడీతో పోటీ పడితే.....!?
అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ  ఉన్నట్లే!
తెలుగు ప్రజల వ్యక్తిగత డేటా ఐటీగ్రిడ్ చేతి గాలిలో దీపం చేశారు: ఈఏఎస్‌ శర్మ
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న ఎక్స్-సిబీఐ జేడి వి వి లక్ష్మినారాయణ!
బాబు ప్రభుత్వంపై  హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!
శ్రీవారి పాదాలు నర్తించిన రవీంద్ర భారతి రసరమ్య వేదిక
తాత మనవళ్ళు మూట ముల్లే సర్ధుకుంటారా?  దెవె గౌడ ఫామిలీ పాక్
వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు
About the author