తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  టీఆర్ఎస్ పార్టీ తాము చేసిన అభివృద్ది పనులు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు నాలుగేళ్లు తెలంగాణకు అధికార పార్టీ ఏమీ చేయలేదని..ప్రజలను పూర్తిగా వంచించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలని లక్ష్యంతా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని మహాకూటంగా ఏర్పడింది.  ప్రస్తుతం టీ కాంగ్రెస్ తో టిటీడీపీ, తెలంగాణ జనసమితి, సిపీఐ జత కట్టిన విషయం తెలిసిందే. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో ఈ రోజు బాబును కలుసుకున్న నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.   బాబుతో సమావేశం అనంతరం..ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని తెలిపారు.   ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా, మరో 1-2 రోజుల్లో తుది జాబితా, అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రజాకూటమిలో 14 కంటే ఎక్కువ సీట్లను కోరితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు.  కూటమి అధికారంలోకి వచ్చే విషయమై ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.రాబోయే ఎన్నికల్లో టీడీపీ రెండు అంకెల సీట్లను గెలుచుకుంటుందని రమణ ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: