తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలన్న పంతంతో ఉంది టీ కాంగ్రెస్.  ఈ నేపథ్యంలో టి కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్,సిపిఐ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడింది.  అయితే ఇప్పటి వరకు సీట్ల సర్థుబాటు విషయంలో తర్జన భర్జన జరుగతూ వస్తున్న విషయం తెలిసిందే. 

తాజాగా మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారయినట్లు సమాచారం.  కాంగ్రెస్ 93, టిటిడిపి -14, టీజేఎస్ - 8, సీపీఐ - 3, టిఐపి-1 లు కేటాయించినట్లు తెలుస్తుంది.   
Image result for CONGRESS
మొత్తాని 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా..26 స్థానాలు మిత్ర పక్షాలకు కేటాయించింది. అంతే కాదు 74 మంది కాంగ్రెస్ అభ్యర్థుల పేరు ఖరారు చేసినట్లు  రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సి కుంతియా తెలిపారు.  10న అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. 

Related image

ఇక టీజేఎస్ పోటీ చేసే  స్థానాలు : 
వరంగల్ ఈస్ట్ - గాదె ఇన్నయ్య
మల్కాజ్ గిరి - దిలీప్ కుమార్
మెదక్ - జనార్థన్ రెడ్డి
దుబ్బాక  - రాజ్ కుమార్
సిద్ది పేట - భవానీ
మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి



మరింత సమాచారం తెలుసుకోండి: