సరిగ్గా ఆరు నెలలు దాటుతోంది. మోడీతో చంద్రబాబునాయుడు లడాయి పెట్టుకుని. అది లగాయితూ రాజకీయమే అంతటా రాజ్యమేలుతోంది. పాలన పక్కన పెట్టేశారు.  సాక్షాత్తూ అధికార పార్టీ విపక్ష  పాత్ర పోషిస్తోంది. కేంద్రాన్ని నిందిస్తూ గడపడమే పనిగా మారింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇంతే సంగతులా మరి. 


దీక్షల రాజకీయం :


ఓ వైపు ధర్మ పోరాట దీక్షలు అంటూ చంద్రబాబు ప్రతి జిల్లాలో మీటింగులు పెడుతున్నారు. అక్కడ బీజేపీని, మోడీని తిట్టడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. ఆ తరువాత పార్టీ మీటింగులు పెడుతున్నారు. అందులోనూ పర దూషణమే. అది కలెక్టర్ల సదస్సా,  మంత్రి వర్గం సమావేశమా,  డ్వాక్రా  మహిళ‌ల మీటింగా అన్న తేడా లేదు. ఎక్కడ చూసినా మోడీని నిందిస్తూనే బాబు గారు పుణ్య కాల‌మంతా గడిపేస్తున్నారు. ఓ విధంగా బాబు వల్ల ఏపీలో మోడీకి మంచికో చెడ్డకో పేరు వస్తోంది.


దేశాలు పట్టేస్తున్నారు :


ఇపుడు కొత్తగా రాష్ట్రాల టూర్లకు బాబు రెడీ అయిపొయారు. డిల్లీ రెండు మార్లు వెళ్ళి వచ్చిన తెలుగుదేశం అధినాయకుడు లేటెస్ట్ గా కర్నాటక వెళ్లారు. తమిళనాడు వెళ్తున్నారు. ఇంకా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ఇలా చాల రాష్ట్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. మిగిలిన పార్టీలు, నాయకులు వారి పాలన వారు చూసుకుంటున్నారు. మరి చంద్రబాబు ఎంత ఖాళీగా ఉన్నారో తెలియదు కానీ ఆయెన అందరి చుట్టూ తిరుగుతున్నారు. జూనియర్ నాయకులను కూడా కలుస్తూ మోడీపై తిట్ల దండకం కురిపిస్తున్నారు.


పాలన ఎక్కడ :


ఓ వైపు ఏపీలో పాలనాపరంగా అనేక లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా శాంతి భద్రతలు సమస్యగా ఉంది. నిధులు లేవంటున్నారు, దాంతో అభివ్రుధ్ధి పనులు పడకేశాయి. జనవరి పండుగ తరువాత ఎటూ సార్వత్రిక ఎన్నికల వేడి మొదలవుతుంది. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే ఇక అభివ్రుధ్ధి పనులకు స్వస్తి చెప్పాల్సిందే. చేయాల్సిన  పనులు తొందరగా చక్కబెట్టుకోవాల్సిన వేళ మూడవ ఫ్రంట్, నాలుగవ ఫ్రంటూ అంటూ బాబు దేశాలు పట్టి తిరగడం వల్ల ఏపీలో రేపటి ఎన్నికల్లో ఆ పార్టీకి దెబ్బేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: