Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:08 am IST

Menu &Sections

Search

హర్షవర్ధన్‌ “చౌదరి జోలికి” వెళ్లొద్దు! ఇదే బాబు మార్క్ సెక్యులరిజం?

హర్షవర్ధన్‌ “చౌదరి జోలికి” వెళ్లొద్దు! ఇదే బాబు మార్క్ సెక్యులరిజం?
హర్షవర్ధన్‌ “చౌదరి జోలికి” వెళ్లొద్దు! ఇదే బాబు మార్క్ సెక్యులరిజం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షినాది రాష్ట్రాల్లో లౌకిక ప్రజాస్వామ్యం గురించి లౌకిక శక్తుల ఏకీకరన గుఱించి విపరీత ప్రచారం మొదలెట్టిన సందర్భంగా ఈ ఉదాహరణ చూస్తే ఆయనెంత లౌకిక వేత్తో భారత జాతికే అర్ధముతుంది.


ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో అధికార పార్టీ నేత, విశాఖ ఎయిర్‌-పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌” యజమాని టి.హర్షవర్దన ప్రసాద్‌ చౌదరి పాత్రను నిగ్గు తేల్చడం పై పోలీసులు చేతులెత్తేశారు. ఆ రెస్టారెంట్‌ కేంద్రంగానే జగన్‌పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము హర్షవర్దన్‌ చౌదరి జోలికి వెళ్లలేమని, ఆ మేరకు తమకు పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని విశాఖ పోలీసులు పేర్కొంటు న్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే ఆదేశాలు అందాయని అంటున్నారు. 
ap-news-secularism-in-ap-administration-chandra-ba ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లోని వీవీఐపీ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.  పోలీసులు ఇప్పటివరకు ఈ కేసు విచారణను కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేశారు. జ్యుడీషియల్‌ కస్టడీ నుంచి ఆరు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పక్కా స్క్రీన్‌-ప్లేతో విచారణ డ్రామాను రక్తి కట్టించారు. హర్షవర్దన్‌ చౌదరిని ప్రశ్నించని పోలీసులు  ap-news-secularism-in-ap-administration-chandra-ba
ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో నిందితుడు శ్రీనివాసరావు సహోద్యోగులైన యువతీయువకులను ఆరురోజుల విచారణ సమయంలో అర్ధరాత్రి 2గంటల వరకు పోలీసు స్టేషన్‌ లోనే ఉంచేవారు. ఓక దశ లో స్టేషన్‌ వద్దనే పడిగాపులు కాస్తున్న మీడియా సిబ్బంది, ఆడపిల్లలను ఇప్పటివరకు స్టేషన్‌ లో ఉంచితే ఎలా? అని ప్రశ్నిస్తే పోలీసులు హడా వుడిగా ఆటోలు తెప్పించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాసరావు సహోద్యోగులను అర్ధరాత్రిదాకా స్టేషన్‌లోనే ఉంచి, విచారణ డ్రామాను నడిపించిన పోలీసులు ఆ రెస్టారెంట్‌ యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల సన్నిహితుడైన హర్షవర్దన్‌ చౌదరిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేకపోయారు. 
ap-news-secularism-in-ap-administration-chandra-ba
స్టేషన్‌లో ఉన్న తన రెస్టారెంట్‌ సిబ్బందిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడల్లా హర్షవర్దన్‌ చౌదరి పోలీస్‌ స్టేషన్‌ లో దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు. పోలీసులంటే తనకు ఓ లెక్క కాదన్నట్లుగా ప్రవర్తించేవాడు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోనే నో పార్కింగ్‌ బోర్డు వద్ద పార్క్‌ చేసేవాడంటే అతడి వ్యవహార శైలి ఏంటో అర్థం చేసు కోవచ్చు. 
ap-news-secularism-in-ap-administration-chandra-ba
హర్షవర్దన్‌ చౌదరి అండ లేకుండానే నిందితుడు బరితెగించాడా? గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్టులో తన రెస్టారెంట్‌లో నియమించుకోవడం. కత్తులు, మారణాయుధాలతో ఎయిర్‌పోర్ట్‌ రెస్టారెంట్‌ లో అతడు విచ్చల విడిగా సంచరించడం, శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా వసతి కల్పించడం, మిగిలిన ఉద్యోగుల కంటే అధికంగా వేతనం ఇవ్వడం, వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పై వ్యూహాత్మకంగానే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం. ఈ వరుస పరిణామాలను గమనిస్తే హర్షవర్దన్‌ చౌదరి అండ లేకుండానే శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి తెగబడ్డాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌ 25న మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా 10 నిమిషాల ముందే హర్షవర్దన్‌ చౌదరి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటన తరువాత శ్రీనివాసరావు చాలా మంచోడండి, అమాయకు డండి, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు అని వకాల్తా పుచ్చుకున్న హర్షవర్దన్‌ చౌదరి తీరుపై అనుమానాలు వెల్లు వెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకం గా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి పాల్పడితే, సదరు ఉద్యోగినే వెనకేసు కొచ్చిన హర్షవర్దన్‌ చౌదరి నిర్వాకంపై పోలీసులు దృష్టి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పోలీసులు తమపై వస్తున్న విమర్శలకు తలొగ్గి హర్షవర్దన్‌ చౌదరిని దీపావళి పండుగ తర్వాత తమదైన శైలిలో విచారించాలని భావించారు. అయితే, హర్షవర్దన్‌ చౌదరి జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం తో తాము మిన్నకుండిపోయామని ఒక పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. హర్షవర్దన్‌ చౌదరిని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలి కుట్రకోణం బట్టబయలై, అసలు కుట్రదారుల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉండడం వల్లే సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి? అని, ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. ఒక లౌకిక వాది ఇలా చేయగలడా? ప్రతిపక్షనెత పై జరిగిన హత్యాచారాన్ని కులం కోణం, బందు మిత్ర కోణంలో కాకపోతే ప్రభుత్వం ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? దేశంలో లౌకిక శక్తుల ఐఖ్యత కోసం ప్రయత్నించే నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, తన కులం వాడైన కారణంగా అనుమానించ తగిన వ్యక్తిని పొలీసులు విచారించక పోవటాన్ని ఎలా సహించారు. ఒక లౌకికవాది ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పాలన & పని చేసే విధానం ఆయన మాట్లాడే లౌకికత్వానికి సరిపడుతుందా! 
ap-news-secularism-in-ap-administration-chandra-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి – బోల్తా కొట్టిన బుల్-బుల్ పిట్ట కేసీఆర్....?
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
About the author